పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైనదిగా భావించే అక్షయ తృతియ సందర్భంగా నగల అమ్మకాలను వినియోగదారుడు ఆకర్షించడానికి అందుబాటులో అనేక ఆఫర్లు ఉన్నాయి. కేవలం డిస్కౌంట్లకు మాత్రమే ఆకర్శితులవ్వకూడదు. హాల్మార్క్ ముఖ్యమని గమనించాలి.  బంగారు ఆభరాలణాల ధర వివిధ షాపుల్లో వేరుగా ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ ధర పట్టికను, మేకింగ్ చార్జెస్, తరుగు, డిస్కౌంట్లను పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మీరు పూర్తిగా బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్నట్లయితే బంగారు నాణేలు, బిస్కెట్లు ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం. ఎంత విలువైన రాళ్ళను పొదిగిన ఆభరణాలయినా.. బంగారం విలువను తగ్గిస్తాయి. అధిక మేకింగ్ చార్జెస్ ఉంటాయి. ఆ నగలను మార్పిడి చేసినప్పుడు, విక్రయించినప్పుడు బంగారం విలువ గుర్తించడానికి రాళ్ళను పూర్తిగా తీసివేయబడతాయి. 
pc:internet

No comments:
Post a Comment