ఆకుకూరలకు నిత్యం ఆహారంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అన్నీ కాలాల్లొ లభించే పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలికూర, మెంతికూర, పొన్నగంటికూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీన.. వగైరా ఆకుకూరలలో అనేక పోషకాలు, విటమిన్లు, ప్రొటీన్లు, మాంసకృత్తులు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. పైగా వీటిల్లో కొవ్వు తక్కువగా ఉండి ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అన్నీ వయసుల వారిలో జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు శారీరక ఎదుగుదలకు, దృఢత్వానికి, చక్కటి ఆకృతికి దోహదపడుతాయి. తోటకూర, గోంగూరలో ఉండే ఫోసియన్ యాసిడ్, విటమిన్ - బి, ఇనుముతో రక్తహీనత దరిచేరదు. శరీరంలో చక్కెర పెరగకుండా చూస్తూ మధుమేహం, అధిక కొవ్వు తగ్గించేందుకు మెంతికూర ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఆకుకూరలతో లభించే విటమిన్ - సి, కాల్షియం ముఖ్యంగా కళ్ళు, దంతాలు, ఎముకల ఆరోగ్యం ఇనుమడింపచేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. గోంగూర, ఎర్రతోటకూర, బచ్చలికూరలో హిమోగ్లోబిన్ సమృద్ధిగా లభిస్తుంది. తోటకూర, చుక్కకూరలో లభించే ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది.
ఆకుకూరల్లో ప్రత్యేక స్థానం ఉన్న గోంగూర కేవలం వెజిటేరియన్ ఫుడ్ లోనే కాక అనేక నాన్ వెజ్ వంటకాల్లో మంచి రుచిని అందిస్తుంది. గోంగూర పప్పు, పొడులు, పచ్చడి, ఊరగాయలు.. ఇలా మంచి అన్నీ రుచికరమే. ఇందులో పోటాషియమ్, క్యాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్ వగైరా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎ, బి1, బి9, సి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉండడంతో గోంగూర బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఉపయోగకారి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వార రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని నియంత్రించే శక్తి గోంగూర ఆకులు కలిగి ఉంటాయి. గోంగూర చర్మ సంబంధమైన సమస్యలకు చెక్ పెడుతుంది. గోంగూర యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడం వల్ల క్యాన్సర్ ను సైతం నివారించడానికి సహాయపడుతుంది.
అయితే సహజ ఔషధగుణాలున్న ఈ ఆకుకూరలు వండడంలో మెలకువలు అవసరం. వీటిపై దుమ్ముధూళి, చిన్నపురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనన్ని ఎక్కువ సార్లు ఫ్లోటింగ్ వాటర్ లో కడగాలి. పది నిమిషాలు ఉప్పుకలిపిన నీటిలో నానపెట్టి ఆ తరవాత శుభ్రపరచుకోవడం మేలు. ఆకుకూరలను వండే సమయంలో పాత్రలపై మూత పెట్టి ఉడికించడం,మగ్గపెట్టడం ద్వారా పూర్తి పోషకాలు లభిస్తాయి. అలాగే ఆకుకూరలను ఉడికించిన నీటిని వృధా చేయకుండా వార్చి ఉప్పు, నిమ్మరసం కలిపి సూప్ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. లేదంటే ఆ నీటిని చారులో కాని, ఇతర వంటకాల్లో కాని కలిపేసుకోవచ్చు. సీజనల్ గా దొరికే చింతాకు, ములగాకు, అవిశ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఆయా కాలాల్లో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది.

No comments:
Post a Comment