కుండ - పేదొడి ఫ్రిజ్‌ | Health Benefits Of Using Clay Water Pot

మండు వేసవిలో సైతం చల్లని నీటిని అందించేవి సహజ సిద్ధగా దోరికే మట్టితో తయారైన కుండ, కూజా, రంజన్‌లు.. ఖరీదైన రిఫ్రిజిరేటర్ లోని చిల్డ్ వాటర్ కన్నా మట్టి కుండలోని చల్లని నీరు తాగితే దాహం తీరడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న ఎండల్లో తాపం నుంచి ఉపశమనం పొందడానికి పట్టణాలలోనూ కుండలు, రంజన్‌లను ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఫ్రిజ్ లోని వాటర్ బాటిళ్ళ నీటి కంటే మట్టితో తయారు చేసిన ఈ పాత్రల్లోని మంచినీరు తాగడం ఎంతో మంచిది. సహజతత్వం కలిగిన మట్టిపాత్రలకు ఉండే చిన్న పాటి రంధ్రాల ద్వారా అనేక సూక్ష్మ జీవులు, మలినాలు బయటకు పోవడం తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. మన శరీరానికి అవసరమున్నంత మేరకు మాత్రమే నీటిని చల్లబరిచే గుణం రంజన్‌ కలిగి ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మట్టి పాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మనం అసిడిటీ సమస్య నుంచి కూడా దూరంగా ఉండవచ్చు.

పూర్వీకులు ఒక మంచినీటికే కాక వంట, భోజనం.. వగైరా వాటికి కూడా మట్టి పాత్రలనే వాడేవారు. మనం ఫ్యాషన్ మోజులో ఆరోగ్యానికి హాని కలిగించే అల్యూమినియం, ప్లాస్టిక్.. తదితర వస్తువులను వాడుతున్నాం. ఇకనైనా పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో మెలుగుదాం..

No comments: