మండే ఎండల్లో చర్మం నిగారింపును కోల్పోతుంటుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో మీ అందానికి వెన్నెలలా వన్నె చేకూరుతుంది. చర్మంలో తేమ శాతం తగ్గకుండా ఎక్కువ నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోవడమేకాక వీటితో ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేయడానికి మేలైనవి అని గమనించాలి. నిమ్మ, నారింజ, బొప్పాయి, టమాటా వంటివి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. అలసిన ముఖంలో కొత్త కాంతిని నింపుతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం పసిడిలా మెరుపులీనుతుంది. అయితే ఫ్రై ఫుడ్, జంక్ ఫుడ్.. వగైరాలకు దూరంగా ఉండాలి. కొబ్బరి బోండం నీళ్ళు, చెరుకు రసం, పళ్ల రసాలు.. వంటి వాటిని తీసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఎండ సమయాల్లో బయటికి రాకుండా ఉండడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే సన్‌స్క్రీన్ లోషన్‌ని రాయడంతో పాటు గొడుగును కూడా వెంట పెట్టుకోవడం మరవద్దు.
No comments:
Post a Comment