చామగడ్డ - ఆరోగ్యం | Amazing Health Benefits of Taro Root | చేమ దుంప

చేమ దుంప లేదా చామగడ్డ.. దుంపకూరల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. చేమ దుంప వేపుడు, పులుసు.. ఏదైనా టేస్ట్ యమ్మీగా ఉంటుంది. కేవలం రుచికోసమే కాకుండా చామగడ్డలో పోషకాలు అధికంగా ఉంటాయని పోషక నిపుణులు చెప్తున్నారు. శుభ్రపరచడం, ఉడకపెట్టడం, తొక్కతీయడం కష్టమనికానీ, జిగురుగా ఉంటాయనికానీ చేమ దుంపలను వాడకుండా ఉండకూడదు. ఇది నేడు పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలకు చక్కని ఔషధంలా పనిచేసే ఆహారం అని గుర్తించాలి. అధిక శరీర బరువును నిరోదించాలంటే వీటికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. కారణం చేమ దుంపల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండడమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువగా ఉండడమే. ఈ ఆహారం నిదానంగా జీర్ణం అవుతూ నెమ్మదిగా శరీరానికి శక్తిని ఇస్తుంది. కొలెస్ట్రాల్ అసలు ఉండదు. హృద్రోగాలు దరిచేరవు. రక్త ప్రసరణను మెరుగుపరిచి హైపర్‌ టెన్షన్‌ని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని ఇనుమడింపచేస్తుంది.

చేమదుంపలో విటమిన్‌ - ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి లతోపాటు కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌.. వగైరా పోషకాలు సమృద్ధిగా అభిస్తాయి. పీచు ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను అదుపు చేస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరంభ్యతరంగా తీసుకోవచ్చు. అనేక చర్మవ్యాధులను నివారిస్తుంది. ఎముకల పటిష్టతకు దోహదం చేస్తుంది. దృష్టిలోపాలను దూరం చేస్తుంది. అధిక పీచు, యాంటిఆక్సిడెంట్ల కారణంగా చేమ దుంప పలు క్యాన్సర్ లనుండి మనని కాపాడడమే కాకుండా క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఆహారం.

No comments: