పుస్తకం హస్తభూషణం | Tips for keeping students reading over the Summer Holidays

టుఇటుగా రెండు నెలల సమ్మర్ హలీడేస్  వస్తున్నాయంటే పిల్లలకు ఎక్కడలేని ఆనందం. ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెల్లడం, ఆటలు-పాటలు వగైరా.. ఇప్పుడు పరిస్థితులు వేరు. వివరాలు అందరికి తెలిసినవే కనుక వాటిల్లోకి వెళ్లకుండా సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే... మంచి పుస్తకమే మంచి మిత్రుడు అనే విషయాన్ని పిల్లలకి నచ్చచెప్పి వాళ్ళలో ఈ వేసవి సెలవులలో పఠనాసక్తిని పెంపొందించాలి. విద్యాసంవత్సరం పొడవునా పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టి ఇప్పుడెందుకు అంటారా.. మంచి పుస్తకాలను సమయం దొరికినప్పుడల్లా తిరగవేసే అలవాటును పిల్లల్లో కలిగించినప్పుడు ఎన్నెన్నో కొత్త విషయాలను వాళ్లంతటవాళ్లే తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే ఖాళీ సమయాన్ని వృథా చెయ్యకుండా పుస్తక పఠనానికే వినియోగించి ప్రయోజకులవుతారు.

ఒక మంచి పుస్తకం.. జీవన వికాసానికి సోపానం. పుస్తక పఠనం కొత్త ఆలోచనలకు, వినూత్న భావాలకు ప్రేరణ కలిగిస్తుంది. మనకు తెలియని విషయాలను పరిచయం చేస్తుంది. ఇతిహాసాలు, వీరగాథలు, నీతికథలు.. ఇలాంటి పుస్తకాలు మనుషుల్లో మంచిని పెంచి, చెడును తొలగించేందుకు ఉపకరిస్తాయి. ఈ సంగతి పిల్లలకు, కౌమారం దాటి యవ్వనంలోకి అడుగుపెట్టేవారికి బోధపడాలంటే కచ్చితంగా వారి చెంతన ఆయా వయసులకు తగ్గట్టు పుస్తకాలుండాలి. కథలు, జీవితచరిత్రలు, ఆత్మకథలు, చరిత్ర... ఇలా వారి బుద్ధివికాసానికి తోడ్పడే పుస్తకాలు అందించడం పెద్దల బాధ్యత అని గుర్తించాలి. అందుకే మన ఇంట్లో పర్సనల్‌ లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు పెద్దలు చదవాలి, పిల్లలతో చదివించాలి. అప్పుడే ప్రతి వ్యక్తి కుటుంబంలో, సమాజంలో ఎలా మెలగాలో తెలుస్తుంది. పుస్తక అధ్యయనం వికాసాన్ని, విజ్ఞానాన్ని అందించడమేకాక ఒత్తిడి నుంచి కాపాడి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.

డిజిటల్ క్లాస్ రూంలు, ప్రయివేట్ క్లాస్ ల ఆప్ లు వచ్చాకా పిల్లలు ట్యాబ్, ల్యాప్ టాప్ లకు అతుక్కుపోతున్నారు. పైగా టీవీ, మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ తదితర కారణాల వల్ల కూడా పుస్తకపఠనం తగ్గుతుందన్న మాట నిజమనిపిస్తోంది. ఎంత టెక్నాలజీని అందిపుచ్చుకుని ఇ-బుక్, ఎ.వి బుక్.. ఇలా ఎన్ని సరికొత్త రూపాంతరాలు వచ్చినా అచ్చురూపంలోని పుస్తకాన్ని మాత్రం వీడకూడదు. 
 

No comments: