మన చేతులు కనిపించినంత శుభ్రం కాదని కంటికి కనిపించని బ్యాక్టీరియాతో అనారోగ్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మఖ్యంగా చేతులు నోట్లో, కళ్ళల్లో, చెవుల్లో పెట్టుకున్నప్పుడు గోర్లతోను ఫంగస్, బ్యాక్టీరియా వగైరా దాడిచేసి పలు ఎలర్జీలకు కారణం అవుతుంది. అలాగే ఆఫీస్ టేబుల్ కు మోచెయి ఆనించి చేతిమీద ముఖం పెట్టి కూర్చోవడం కూడా ప్రమాదకరమే అంటున్నారు. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ నుండి ఆఫీస్ లో కంప్యూటర్ కీబోర్డ్, ఫోన్... వరకు అన్నీ ముట్టుకున్న చేతులను ఎల్లప్పుడు తప్పక శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా ఆహారం తీసుకునే ముందు, బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు హ్యాండ్ వాష్ సోప్ లేదా లిక్విడ్ తో శుభ్రం చేసుకోవడం విధిగా చేయాలి. చిన్నారులకు దీనిని తప్పక అలవాటు చేయాలి.
చేతులు కూడా సున్నితమైనవేనని గుర్తించాలి. కనీసం రోజుకు రెండు సార్లయినా మాయిశ్చరైజింగ్ క్రీమును చేతులకు తప్పనిసరిగా రాసుకోవాలి. రాత్రిపడుకునే ముందు చేతులకు కొబ్బరినూని కూడా పట్టించవచ్చు. పొడిచర్మం ఉన్నవారు ఉప్పు కలిపిన నీటితో చేతులను కడుక్కుంటే మంచిది. అలాగే గిన్నెలు, గుడ్డలు శుభ్రపరిచే డిటర్జెంట్లతో చేతులకు హాని కలగకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో ఫ్లోర్, బాత్రూం వగైరా క్లీన్ చేసే సమయంలో, గార్డెన్‌లో పనిచేస్తున్నప్పుడు తప్పక చేతులకు రబ్బర్ గ్లౌజులను వేసుకోవడం మరవకూడదు. అలాగే చర్మసౌందర్యం ఇనుమడింపచేసే తాజాకూరగాయలు, పండ్లతో పాటు అలాగే వేళ్ళ గోళ్లు అందంగా కనిపించడానికి కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవాలి. గోళ్లను ఎప్పటికప్పడు కట్ చేసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

pc:internet
No comments:
Post a Comment