విసుగు - విరామం | Health Benefits of Taking a Holiday | Rest Renew Rejoice

దివారం విశ్రాంతి తీసుకుంటే మిగతా ఆరురోజుల పనిదినాల్లో ఉత్సాహంగా ఉంటారు. వారానికి సెలవుదినం ఒకటైనా, రెండైనా సరియైన విశ్రాంతి అవసరం. మరి విశ్రాంతి అనగానే ఎవరి నిర్వచనాలు వారికి ఉంటాయి. వీక్ ఎండ్స్ లో అర్ధరాత్రి వరకు మెలకువ ఉండవచ్చని, సెలవురోజున బారెడు పొద్దెక్కేదాకా పడుకోవచ్చని, రోజూకంటే ఎక్కువగా తినేయవచ్చని.. వగైరా. పైగా ఇప్పుడు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ లతో సెలవురోజుల్లో కూడా ఆఫీస్ పనులు, ముచ్చట్లే..

అసలు విశ్రాంతి అంటే పనీపాట లేకుండా కూర్చోవడమో, పడుకోవడమో కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల రోజూ ఆఫీస్ లో చేసే రొటీన్ పనులే మైండ్ లో మెదులుతూ అసహనం, చికాకు పెరిగిపోతాయి. దానితో పేరుకు సెలవు అయినా మానసికంగా చాలా అలసిపోతారు. అందుకని రోజువారీ రొటీన్‌ పనులకు ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా భిన్నమైన విషయాల్లో మనసు లగ్నం చేయాలి. అంటే హ్యప్పీగా ఫ్యామిలీతో గడపాలి. సినిమాలు, షికార్లకు ఔటింగ్ వెళ్లడం, బంధుమిత్రులను కలవడం వగైరా చేయాలి. ఒక్క సెలవు రోజు కూడా అంత తిరగడం ఏంటి, ఇంత బిజీగా గడపాల అంటే అవుననే నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్లనే విశ్రాంతి భావన కలుగుతుంది. శరీరం బాగా అలసిపోయినా మనసు ఉల్లాసంగా ఉందంటే అది కొత్తవిషయాల్లోంచి పుట్టుకొస్తుంది మరి. అందుకే నూతనత్వానికీ, సృజనాత్మకతకూ అంత ప్రాముఖ్యత ఉందని గమనించాలి. బుక్ రీడింగ్, గార్డెనింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్, సింగింగ్.. ఏదైనా అలవర్చుకోవాలి.
 pc:internet

No comments: