మిక్సీ వినియోగం - జాగ్రత్తలు | How to Care for your Juicer and Mixer Grinder

వేసవిలో మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్.. అంటూ మిక్సర్ గ్రైండర్ ఉపయోగం పెరుగుతుంది. మిక్సర్ నిర్వహణలో ఏమాత్రం అశ్రద్ద వహించినా ఫలితం చెడుతుంది. అందుకని మిక్సర్ పనితీరు గురించి కాస్తాయినా తెలుసుకుందాం..
- గృహఅవసరాలకై మిక్సర్ ల సామర్ద్యం సాధారణంగా 350 నుంచి వెయ్యి వాట్ ల వరకు ఉంటుంది. ప్రధానమైన మోటర్ అతివేగంగా ఒక్క నిమిషంలో 15 నుంచి 20 వేల చుట్ల వరకు తిరుగుతుంది.
- చవకరకం మిక్సర్ అయితే రెండు, మూడు నిమిషాలకు మించి వాడకూడదు. తగిన విశ్రాంతి ఇచ్చి తిరిగి వాడుకోవాలి. నాణ్యమైన మిక్సర్ గంట పాటు ఏకదాటిగా వాడుకునే అవకాశం ఉంది.
- ఇక ఎససరీస్ విషయానికి వస్తే పిండి, జ్యూస్ లను తయారుచేసుకోవడానికి మూడు జార్ లు ఉంటాయి. అలాగే ఆయా పనులకు ప్రత్యేకించిన బ్లేడ్ లు కూడా వుంటాయి. మజ్జిగ చిలకడానికి, పిండి పట్టడానికి, పొడి కొట్టడానికి కంపనీవారు సూచించిన బ్లేడ్స్ ని మాత్రమే విధిగా వినియోగించాలి.
- మోటర్ కి జార్ నైలాన్ కప్లింగ్ సహాయంతో బిగుసుకుంటుంది. జార్ ని లాక్ చేసి కానీ మోటర్ ఆన్ చేయకూడదు. లాక్ సిస్టం లేని మిక్సర్ జార్ ని జాగ్రత్తగా పట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు జార్ లకు సంబంధించిన మూతలను మాత్రమే వాడాలి.
- విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి మిక్సర్ అడుగు భాగం, ప్లగ్, పవర్ సప్లై కార్డ్ నీటిలో తడవకూడదు. ముఖ్యంగా జార్ అడుగు భాగంలోకి నీళ్ళు పోకుండా జాగ్రత్త పడడం అవసరం. మిక్సర్ ఉపయోగం అయిపోగానే  ఎలక్ట్రికల్ స్విచ్ ఆపేసి సాకెట్ నుంచి ప్లగ్ ని తీసివేయాలి.
- అధిక వోల్టేజి నుంచి మిక్సర్ కు రక్షణ, విద్యుత్ షాక్ నుంచి మనకు రక్షణ కలగాలంటే తప్పకుండా సరియైన ఎలక్ట్రికల్ ఎర్తింగ్ అవసరం. అలాగే త్రీ-పిన్ ప్లగ్ ని మాత్రమే విధిగా వాడాలి.
- చేతితో బ్లేడ్స్ ని మార్చడం అత్యంత ప్రమాదం అని గుర్తించాలి. విధిగా స్పానర్ ని మాత్రమే వాడాలి. జార్ లను శభ్రపరచడానికి ధారగా వస్తున్న నీటిని, బ్రష్ ని వాడుకోవాలి.
- బ్లేడ్ లెవల్ కు తక్కువ కాకుండా సగం జార్ కు మించకుండా ఏవైనా మిక్సీ పట్టాల్సిన పదార్థాలుండాలి. కోల్డ్ కాఫీ, లస్సీ, మిల్క్ షేక్ లకు 'ఇన్చ్' ప్రెస్ బటన్ వాడాలి. మిగతాపనులకు అవసరాన్ని బట్టి లో, మీడియం, హై స్పీడ్ బటన్ లను వినియోగించాలి.
- మిక్సీని పిల్లలకు అందకుండా , గ్యాస్ స్టౌ, దీపాలకు దూరంగా, సూర్యరశ్మి నేరుగా పడకుండా అమర్చుకోవాలి.

మిక్సీ ని సులభంగా శుభ్రపరచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మళ్ళీ తెలుసుకుందాం.! 

No comments: