చన్నీటి స్నానం ఉత్తమం | Scientifically Proven Health Benefits of Taking a Bath

బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకపోవడం, కనీసం దంతదావనం కూడా లేకుండా బెడ్ కాఫీ ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. రాత్రిపూట ఉద్యోగస్తుల సంగతి మినహాయిస్తే మిగతా వారు అర్దరాత్రి వరకు టీవి, సోషల్ మీడియాలో కూరుకుపోయి నిద్రపోవాల్సిన సమయాన్నంతా వృథా చేస్తున్నారు. ధర్మశాస్త్రాలు చెప్పినవి పాతచింతకాయ పచ్చడిలా మారాయి. కొంత మంది సమయాభావం నెపంతో టాల్కమ్ పౌడర్, బాడీస్ప్రేలు కొట్టేసి స్నానం అయిపోయిందనుకుంటున్నారు.

అయితే ప్రతిరోజూ ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేయడం శ్రేయష్కరం. ఎట్టిపరిస్థితుల్లోనూ అతి చల్లని, అతి వేడి నీటి జోలికి వెళ్ళకూడదు. క్రమం తప్పకుండా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చాలా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికి కారణం రోగాలతో పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగి, రక్తప్రసరణ మెరుగయ్యి రోగ నిరోధకశక్తిని ఇనుమడింపచేయడమే. అంతే కాకుండా ఒత్తిడి, డిప్రెషన్‌.. వగైరా దూరం అయి ఫ్రెష్ నెస్ ని ఇస్తుంది. ఎలాంటి అనారోగ్యంలోనైనా స్నానం చేయడం తప్పనిసరి. దీని వల్ల త్వరగా కోలుకుంటారు.

No comments: