గాలిలోని వాహకాలు, దోమల ద్వారా వ్యాపించే మలేరియా వ్యాధి వేసవిలో మరింత విజృంబిస్తుంది. సరియైన సమయంలో చికిత్స అందకపోతే ఈ జ్వరం మెదడు, కిడ్నీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో మలేరియా కారణంగా సంభవిస్తున్న వేల మరణాలను తగ్గించడానికి నిపుణులు ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా సూచిస్తున్న జాగ్రత్తలు ఇవి..
- గృహాలు, సమీప పరిసరాలు ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో దోమలు వృద్ధి చెందకుండా చూడవచ్చు
- బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా, పనికి రాని పాత వస్తువులను ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సిబ్బందికి ఇచ్చేయాలి
- వాటర్ సంప్, స్టోరేజ్ ట్యాంకుల్లో తాజా వేపగింజల పొడిని చల్లితే దోమలు చేరవు
- కూలర్లలో నీళ్లు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
- తాగి పడేసిన కొబ్బరి బోండంలోకి వర్షం నీరు చేరకుండా చూడాలి
- నిలువ నీటిని తొలగించడం, ఎటూ మార్గంలేకపోతే కిరోసిన్ చల్లాలి
- నీటి బిందెలు, బకెట్, వంటపాత్రలపై ఎల్లప్పుడు విధిగా మూతలు ఉండేలా చూసుకోవాలి
- దోమతెరలు ఉపయోగించడం లేదా వేప నూనె, కర్పూరం వగైరా ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలతో దోమలకు చెక్ పెట్టాలి కాని మస్కిటో కాయిల్స్, ఎలక్ర్టికల్ రీఫిల్స్ జోలికి వెళ్లకూడదు

pc:internet
No comments:
Post a Comment