పార్కుకి వెళుతున్నారా.. | Tips for taking Children to Parks | Summer Safety Tips

సమ్మర్ హాలీడేస్ లో పిల్లలకు కాలక్షేపానికైనా, వేడిమి ఉపశమనానికైనా పార్కులు అంటేనే అమితమైన ప్రేమ కనబరుస్తారు. పార్క్ లో ఆట వస్తువులు, ఆహ్లాదపరిచే వాటర్ ఫౌంటేన్ లు, మ్యూజిక్ థీమ్స్, తినుబండారాలు... ఇక పిల్లల ఆటపాటలకి అంతేముంటుంది. వారి ఆనందానికి అవదులేముంటాయి. అయితే పార్క్ లలో పిల్లలతో పాటూ తల్లితండ్రులు ఆనందంగా ఈ వేసవి సెలవులు గడిపెయాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం..

ఆటస్థలాలు, పార్కుల్లో పిల్లలను ఒక కంట కనిపెడుతూండాలి. ఉయ్యాల, క్లైంబర్, ల్యాడర్, మంకీ బార్స్, జారుడుబండ.. లాంటి ఆట వస్తువులు సరిగా ఉన్నాయా లేదా ముందుగా చూడాలి.  పరిసరాలను విధిగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆటస్థలంలో నేల గట్టిగా, ఎత్తుపల్లాలు ఉండడం, మరమ్మతు పనులు జరుగుతుండడం.. లాంటివి గమనించి పిల్లలతో తదనుగుణంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు పరికరాల నిర్వహణ లోపంతో తుప్పుపట్టడం, పగుళ్లుండడం, విరిగిపోవడం చేత ఆపదలు కొనితెచ్చుకున్నవారమవుతాము. విసరడం, తోయడం, లాగడం... లాంటి ఆటలకు ప్రావీణ్యత అవసరం, ఇలాంటివి పిల్లలకు అపాయం కాబట్టి అక్కడే ఉన్న నిపుణుల సహాయం కోరడం మంచిది. వివిధ రకాలైన రంగులరాట్నం, బోటింగ్, స్విమ్మింగ్ తదితర ఆటల విషయంలో పిల్లలతో పెద్దలు అందుబాట్లో ఉండడం, పైగా ప్రికాషన్స్ తో ఉండడం అవసరం.

ఎక్కువ సమయం బయట గడపడం, పైగా వేసవి కనుక సరిపడా మంచి నీరు, స్నాక్స్ తీసుకెళ్లాలి. అప్పుడే పిల్లలకు ఆకలి, దప్పికలను తీర్చగలం. గార్డెన్ లో వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్, విద్యుత్ వైర్లు, పరికరాల జోలికి పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే వ్యక్తిగత గుర్తింపు కార్డును వాళ్లకు ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకోమనాలి.

No comments: