పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయంటే వారివారి అభిరుచుల్లో శిక్షణ పొందడం అంటే మహా సరదా. ఇక స్విమ్మింగ్ కి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పైగా మంచి శరీరాకృతిని కోరుకునేవారికి, ఉల్లాసవంతమైన వ్యాయామం కోరుకునేవారికి ఈత చక్కని ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. స్విమ్మింగ్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ అంతా కొలనులో, అందునా ట్రైనర్ మధ్య కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదనుకుంటే పొరపాటే. ఏమాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధులు పొంచి ఉండే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దలు ఈతను సరదాగా ఎంజాయ్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
- భోజనం చేసిన వెంటనే ఈత కొట్టకూడదు.
- స్విమ్మింగ్‌పూల్‌లోకి వెళ్లక ముందు, స్విమ్మింగ్ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయాలి.
- కొలనులో తల తడవకుండా మాస్క్ పెట్టుకోవాలి, అలాగే చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్ ప్లగ్స్, కళ్లకు గాగుల్స్ తప్పక పెట్టుకోవాలి.
- స్విమ్మింగ్‌పూల్ నీటిలో కలిపే క్లోరిన్ తదితర రసాయనాలు సరైన పాళ్లలో ఉండాలి లేదంటే చర్మం, తలవెంట్రుకలు, కళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
- స్విమ్మింగ్‌పూల్ ఆరుబయట ఉన్నట్లైతే మధ్యాహ్నం ఎండలో ఈత పనికిరాదు.
- స్విమ్మింగ్ పూర్తవగానే దుస్తులు మార్చుకుని పూర్తిగా తుడుచుకోవడం మరవద్దు. అవసరమనుకుంటే మాయిశ్చరైజర్ కూడా వినియోగించాలి.

No comments:
Post a Comment