వేసవిలో మొక్కలు ఎండిపోతున్నాయా.. కొత్త మొక్కలు పెట్టాలా వద్దా అని సంశయమా.. ఎలాంటి సందేహం లేకుండా ఎండ తీవ్రత నుంచి మొక్కల్ని రక్షించుకోవచ్చు. అయితే ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశంలో, మేడపైన, బాల్కనీ, పోర్టికోల్లో పెంచే మొక్కలకు సూర్యరశ్మి తప్పనిసరి. అలాగని మండే ఎండల్లో మొక్కలు తాళలేవు కనుక గ్రీన్ షేడ్ నెట్‌ను తప్పక ఉపయోగించాలి. దీనివల్ల తక్కువ ఖర్చుతోనే ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, పూలమొక్కలతో పాటు వివిధ రకాలైన మొక్కలను, చెట్లను కాపాడుకోవచ్చు. మన పెరటి మొక్కలు, కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ లకు సరిపడా కొలతలతో గ్రీన్ షేడ్ నెట్ గార్డెనింగ్ మెటీరియల్ అమ్మే దుకాణాల్లో, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ లలోనూ దొరుకుతుంది. ఇది కొనే ముందు ఈ క్లాత్ పై అవగాహణ ఉండాలి. ఇది మొక్కలపై నేరుగా పడే ఎండని 50శాతంకి పైగా ఆపగలుగుతుంది. ఒక మీటర్, రెండు మీటర్ల తాన్లలో మనకు ఎన్ని మీటర్ల పొడుగు నెట్ అవసరమో చూసుకోవాలి. తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే పెరిగే మొక్కలను పెంచుకోవడానికి ఏడాది పొడవునా ఈ నెట్ వినియోగపడుతుంది.
- మొక్కలను నాటే ముందే సారవంతమైన మట్టిని ఎంచుకోవాలి. వీలైతే సేంద్రియ ఎరువులను కలిపిన మట్టి అయితే మరీ మంచిది.
- వేసవిలో మొక్కలు వాడిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వటింటి వ్యర్థాలనే సహజ ఎరువులుగా వాడాలి. వాడేసిన టీ, కాఫీ పొడి, కాఫీ గింజలు, కోడిగుడ్డు డొల్లలు.. వగైరా మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగపడుతాయి. వీటి వల్ల మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మొక్కలకు పుష్కళంగా అందడంతో చాలా బలం చేకూరుతుంది.
- మొక్కల చుట్టూ మడిలో, కుండీల్లో మట్టి ఎండ తీవ్రతకు గట్టిపడిపోకుండా రకరకాల ఎండు ఆకులను సేకరించి వేసుకోవాలి. లేదంటే వేర్లకు ఆక్సిజన్ అందని పరిస్థితి ఏర్పడి ఎదుగుదల క్షీణించి కొన్ని రోజులకు మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ మల్చింగ్ పద్ధతిని ప్రయోగిస్తే మొక్క సహజసిద్ధంగా ఎదుగుతుంది.
- కుండీలో నీరు ఎప్పుడూ నిలవకుండా చూసుకోవాలి. కుండీ అడుగుభాగాన రంధ్రం నుంచి నీరు సజావుగా వెళ్లిపోయేలా ఉండాలి.
- ఇండోర్ ప్లాంట్ల కుండీలు, మొక్క కాండం.. వీటికి ఎలాంటి రంగులు వేయరాదు. దీని వల్ల రంధ్రాలు మూసుకుపోయి ఆక్సిజన్ అందే అవకాశం ఉండదు.
- మొక్కల మధ్యలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరిపారేయాలి. లేదంటే అసలైన మొక్కలకు అందాల్సిన పోషకాలన్నింటినీ ఇవి తీసేసుకుంటాయి.
ఈ జాగ్రత్తలు పాటిస్తూనే మొక్కల పెంపకంలో, పనిముట్ల ఎన్నిక విషయంలో.. ఎలాంటి సందేహాలున్నా అంతర్జాలంలో ఆ మొక్కలకు సంబంధించిన సమాచారం చదవడం లేదా దగ్గర్లోని నర్సరీకి వెళ్లి నిపుణుల సలహాపాటించడం తప్పనిసరి.

pc:internet
No comments:
Post a Comment