ఫూల్స్ డే కథాకమామిషు! | Origin and History of April Fools' Day | 1 April

ఫ్రాన్స్ లో పూర్వం ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త సంవత్సరం మొదలయ్యేది. 1582 సంవత్సరంలో చార్లెస్ అనే రాజు కేలండర్ లో మిగతా మాసాల పేజీలు చింపేసి జనవరి ఒకటో తేదీనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుందాం అన్నాట్ట. అయితే ఈ విషయం ఆ రోజుల్లో జనాలందరికి అంత ఈజీగా ఒకేసారి తెలిసే అవకాశమే లేదు కదా. ఆ సమాచారం తెలిసిన వారు జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరానికి స్వాగతాలు పలికితే, ఆ విషయం తెలియని వారు యధావిధిగా ఏప్రిల్ ఫస్ట్ నే న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారుట. దీంతో రాజు ప్రకటన ప్రకారం జనవరిలో వేడుకలు చేసుకున్నవారు ఏప్రిల్ 1న సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నవాళ్ళని ఆటపట్టించారు. ఇదే ఒక సంప్రదాయంగా మారింది. ఇలా ఫ్రాన్స్ ఫూల్స్ కథ అమెరికా, బ్రిటన్ దాటి ప్రపంచ దేశాలకు చేరింది. ఆనాటి నుంచి ఏటా ఏప్రిల్ ఫస్ట్ తారీఖున ఒకరినొకరు ఫూల్స్ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. సరదాగా, సంతోషంగా సాగాల్సిన ఈ వ్యవహారం కాస్తా ఇప్పుడు ఎదుటివారిని ఇబ్బంది పెట్టే దశకు చేరిందనే చెప్పాలి.

అయినా సంవత్సరానికి ఒక్కరోజు ఏమిటి? 365 రోజులు ఫూల్స్ మే కదా అని గమనించిన వారికి ఇదంతా మామూలే. మ్యానిఫెస్టో చూసి ఓట్లు వేసి గెలిపించి, వారి చేతిలో ఏకంగా ఐదేళ్ళపాటు మనం ఫూల్స్ అవుతున్నాం కదా.. ప్రపంచాన్నే కుగ్రామంగా మలిచిన టెక్మాలజీ యుగంలోనూ అన్నీ కల్తీయేగా.. ఆహారం మొదలు అనారోగ్యానికి వాడే ఔషధాల వరకు, చివరికి ప్రకృతి వరప్రసాదాలకు కూడా మినహాయింపు లేదు కదా..



No comments: