నడక తరువాత ప్రాధాన్యం ఉన్న వ్యాయామం - సైక్లింగ్. దీంతో కాళ్లు, చేతులు, భుజాలు, వెన్ను, పొట్ట - ఇతర కండరాల రక్త ప్రసరణ మెరుగై ఆరోగ్యవంతులవుతారు. సైకిల్‌ను ఒక క్రమపద్ధతిలో తొక్కడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి స్థూలకాయం ఏర్పడే ప్రమాదం ఉండదు. శారీరకంగానే కాక
మానసికంగానూ ఎన్నో లాభాలున్నాయి అంలున్నారు నిపుణులు. అయితే సైకిల్ ఎంపిక, నిర్వాహణలో చిట్కాలు చూద్దాం..
ఆన్ లైన్ లో సైకిల్ ధర తక్కువుందనో, మోడల్స్ ఎక్కువున్నాయనో కొనడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. షాపుకెళ్లి సరియైనది ఎంచుకోవలసి ఉంటుంది. దీనితో సైజులో, బరువులో సరిపోయినవే కాక అభిరుచికి అనుగుణంగా మోడల్, రంగు ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
మానసికంగానూ ఎన్నో లాభాలున్నాయి అంలున్నారు నిపుణులు. అయితే సైకిల్ ఎంపిక, నిర్వాహణలో చిట్కాలు చూద్దాం..
సైకిల్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణనే కాక నిత్యం కనీసం అరగంట తొక్కగలిగితే శారీరక, మానసిక ఉల్లాసం పొందవచ్చు. సైకిల్ తొక్కటం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవటంతో పాటు కండరాల పుష్టికి దోహదం చేస్తుంది. పోటీ ప్రపంచంలో వయసుతో సంబంధంలేకుండా వచ్చే అనేక రకాల రగ్మతలను దరి చేరకుండా సైక్లింగ్ ద్వారా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment