పలు జుట్టు సమస్యలకు సమతుల ఆహారలోపమే కారణం అని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యగా జుట్టు చిట్లిపోవడం సమస్య తలెత్తకుండా ఉండాలంటే రోజూ ఆహారంలో అన్నంతో పాటు అన్నీ రకాల పప్పుదినుసులు, తాజా కూరగాయలు, మొలకెత్తిన గింజలు.. వగైరా తగినంత మోతాదులో ఉండాలి. అలాగే రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తప్పకుండా తాగాలి.
ఫ్యాషన్ అంటూ తలకు నూనెలు రాయకుండా ఉండకూడదు. వారానికి రెండుసార్లు మైల్డ్ షాంపూతో తలస్నానం విధిగా చేయాలి. అతి వేడి నీటి జోలికి వెళ్ళకూడదు. జుట్టు తడి పూర్తిగా ఆరె వరకు వెంట్రుకలను దువ్వకూడదు. తల తుడవడానికి మెత్తని టవల్ ని మాత్రమే వాడాలి. హెయిర్ డ్రైయర్ వాడకూడదు. మీ టీ-షర్ట్ తల తుడుచుకోవడానికి వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. సహజమైన నూనెలను కాస్త గోరువెచ్చగా తలకి మాలిష్ చేసుకోవడం ఉత్తమం. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, క్యాస్టర్ ఆయిల్... ఇలా ఏదైనా ఉపయోగించ వచ్చు. ఇవి జుట్టుకు మాయిశ్చరైజ్ చేయడంతో పాటు కేశాల చివర్లు విరగకుండా కాపాడుతాయి.
జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరినూనె ఉత్తమమైనది. ఇది సహజసిద్ధంగా వెంట్రుకలలోని తేమను నిలిపి ఉంచి డ్రై కాకుండా కాపాడుతుంది. గోరువెచ్చని కొబ్బరినూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి శుభ్రపరచడం ద్వారా విరుగుడు సమస్య నుంచి దూరం కావచ్చు. చిట్లిన వెంట్రుకలకు మిశ్రమ నూనెల వినియోగం మంచి ఉపాయం. దీనికి కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె... వాడుకోవచ్చు. ఇక ఒత్తుగా, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

No comments:
Post a Comment