తెలుగు రాష్ట్రాల్లో విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించినట్టుగా ఈ వారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదు అవుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేయగా 44 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముంది. ఇలా ఎండలు మండిపోతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
వేసవిలో త్వరగా అలసిపోతాం. మండుటెండలకు ఒళ్ళంతా చిటపటలాడుతుంది. ఏ మాత్రం ఎండలోకి వెళ్ళినా చెమటలు పట్టడం, చర్మం నల్లబడడం, గొంతు ఆరిపోయి తరచూ దాహం వేయడం జరుగుతుంటుంది. మరి వేసవి అంతా హాయిగా గడపడానికి ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు అత్యవసరం. అలాగే కొన్ని చిట్కాలు కూడా పాటిస్తే ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది.
- తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను ఎంచుకోవాలి. నూనెలో వేపిన పదార్థాలు, మసాలలతో పాటు పులుపు, కారం తగ్గించాలి.
- వేసవిలో విరివిగా లభ్యమయ్యే ఆకుకూరలు, జామ, రేగు, పనస, అరటి, మామిడి, ద్రాక్ష పలు రకాల పసందైన పండ్లు రోజూ వాడాలి.
- చెరకు రసం, కొబ్బరినీళ్ళు ఇతర పండ్ల రసాలను ఆధికంగా తీసుకోవాలి. కూల్ డ్రింకులు, షోడాల్లాంటి పానీయాల జోలికి వెళ్ళకూడదు.
- కొత్తకుండలో నీళ్ళు, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయల వాడకం పెంచాలి. ఇవన్నీ తేలికగా జీర్ణమయ్యి ఆకలిని పెంచుతాయి. అంతేకాకుండా మానసిక ఉల్లాసం, ఆహ్లాదం కలిగిస్తాయి.
- రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లి, సగ్గుబియ్యం, సబ్జ.. మొదలైనవి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి ఆరోగ్యానికి మేలు కలుగజేస్తాయి.
- ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరకపోతే గ్లాసు నీళ్ళలో చిటికెడు శొంటి పొడి కలిపి మరిగించి తరచూ కొద్దికొద్దిగా తీసుకుంటే సరిపోతుంది.
- మామిడి పండ్లు వేడిచేసి అనారోగ్యం పాలుచేస్తాయని అపోహలు ఉన్నాయి. కానీ వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లు మంచి ఆరోగ్యానికి, వేసవి బాధలకు విరుగుడుగానూ పనిచేస్తాయి.
- వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించడానికి కీరా దోసకాయలు, సొరకాయ, ఉల్లిపాయలు, ముల్లంగి, టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని విరివిగా వినియోగించాలి.
- కొబ్బరిబోండాం నీళ్ళు వేసవిలో ప్రబలే పచ్చ కామెర్లకు దివ్యౌషధం. పలురకాల వ్యాధులతో పాటు మూత్రవ్యాధులు దూరమవుతాయి. రక్త శభ్రతకు, సెగ గడ్డలు, దురద, తామర - ఇత్యాది చర్మ సంబంధిత అంటువ్యాధులను అరికడుతుంది.

No comments:
Post a Comment