ఆరోగ్యమస్తు.! | World Health Day - 7 April

రోజురోజుకి పెరిగిపోతున్న వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. అభివృద్ధి పేరిట వేగంగా జరుగుతున్న ఇండస్ట్రియలైజేషన్, వాహనకాలుష్యం.. తదితర కారణాలతో నగరాల్లో ఆస్తమా బాధితులు పెరుగుతున్నారు. సీవోపీడీ, బ్రాంకైటీస్‌ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు నగర కాలుష్యమే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
- వ్యక్తిగత వాహనాలను వదిలి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని ఎంచుకోవాలి.
- బాత్‌రూం, టయిలెట్ క్లీనింగ్ లకు ఘాటైన ఆమ్లాలలను వినియోగించకూడదు.
- క్రిమికీటకాల మందుల విషయంలో  కూడా తగు జాగ్రత్త అవసరం.
- దుప్పట్లు, పరుపులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోకపోతే డస్ట్‌మేట్స్‌ చేరి అనారోగ్యం పాలవుతారు.
- వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి.

No comments: