బామ్మమాట బంగారు బాట | How to avoid Vomiting during Traveling by Car or Bus?

కార్, బస్, ట్రైన్.. ఎందులోనైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వికారం, వాంతులతో ఇబ్బంది పడుతున్నారా. ఎంజాయ్ చేయవలసిన జర్నీ టూర్ అంతా నీరసంగా సాగుతోందా... అయితే ఈ చిట్కాలు పాటిస్తే ఇక మీకు హ్యప్పీ జర్నీయే!

- వాంతులు అవుతాయని ఎమ్టీ స్టమక్ తో ప్రయాణం చేయకూడదు. అలాగని ఎక్కువగానూ లాగించేయకూడదు. ప్రయాణం కారణంగా అజీర్ణంకి దారితీస్తుంది.


- వెహికిల్స్ లో సఫకేషన్ తో కూడా ఇబ్బంది కలుగవచ్చు కనుక స్వచ్చమైన గాలి వచ్చేలా చూసుకోండి.


- ఘాట్ రోడ్లలో ప్రయాణమైనా, మామూలు రహదారులపైన ప్రాయాణమైనా చాలా దూరంగా దృష్టిసారించకూడదు.  దీని వల్ల కళ్ళు తిరుగుతాయి.


- బామ్మ చెప్పినట్టు ప్రయాణంలో వికారం, వాంతులతో సతమతం అవకుండా ఒక నిమ్మకాయని దగ్గరపెట్టుకోవడం ఉత్తమం. దీన్ని కొరికినా, గిల్లి వాసన చూస్తున్నా అలాంటివన్నీ మటు మాయమవుతాయి.


- అలాగే అల్లం చాలా పవర్‌ఫుల్‌ గా పనిచేస్తుంది. అంతే కాకుండా అల్లంలో ఉండే ఆమ్లాలు తిన్న ఆహారం తేలికగా జీర్ణమవడానికి సహాయపడుతాయి. అందుకని చిన్న చిన్న అల్లం ముక్కలను కాస్త ఉప్పు అద్దుకుని దగ్గర పెట్టుకోవాలి. అల్లం చాయ్. అల్లం రబ్బ కూడా అద్భుతంగా వాంతులు, వికారం లాంటివి మీ దరిచేరకుండా కాపాడుతాయి.


- కొన్ని పుదీనా ఆకుల్ని నలిపి వాసన చూడటం లేదా నమలటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పుదీనా ఆకులను వేసి మరిగించి చల్లార్చిన నీటిని సిద్దం చేసుకోవడం ఉత్తమం.

pc:internet

No comments: