గురు బ్రహ్మ ! గురు విష్ణు !! గురు దేవో మహేశ్వరః !!! | గురుపూర్ణిమ | వ్యాసపూర్ణిమ


మనం జ్ఞానం కోసం పూజించేది ముఖ్యంగా సరస్వతి దేవి, వినాయకుడు.. కానీ, జ్ఞానావతారం అని ప్రఖ్యాతి పొందిన రూపం దక్షిణామూర్తి రూపం. శివాలయాలకు వెళ్లినప్పుడు శివుడి దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో దక్షిణ దిక్కుగా ఉన్న మూర్తిని దక్షిణామూర్తిగా గమనిస్తాం.. అంతే. కానీ వేదాంతశాస్త్రంలో కొంత పరిచయం ఉన్నవారికి దక్షిణామూర్తి చాలా ముఖ్యమైన ప్రతీక. దక్షిణామూర్తి స్తోత్రం అనే చిన్న స్తోత్రం ఉపనిషత్తుల అర్థాన్నంతా అందిస్తుంది. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆషాడ మాసంలో వచ్చే పొర్ణమి రోజున జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటాం. మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ అత్యంత ప్రధానమైనది.

శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

చతుర్వేదాలను, పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకందించిన వ్యాసభగవానుడి జన్మతిథి కూడా కావున గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం. అష్టాదశ పురాణాలు, మరెన్నో ఇతిహాసాలను మనకు ప్రసాదించి వేదవ్యాసుడు సర్వగురువులకూ గురుస్థానీయుడుగా ప్రసిద్ధి చెందాడు.

"గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః" మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులో అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు వుంటాడు. ఆ గురువే ప్రత్యక్ష దైవమని భావించే ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు. 


https://www.youtube.com/c/vantintichitkalu 



#ఆషాడ మాస ప్రాముఖ్యత
పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసంగా చెప్పబడుతుంది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది.

No comments: