July 1 : హ్యాపీ డాక్టర్స్ డే | Doctors' Day: What is it?



"శరీరే జర్ఝరీ భూతే, వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషథం జాహ్నవీ తోయం, వైద్యోనారాయణోహరిః"
ఇవాళ డాక్టర్ బీథాన్ చంద్రరాయ్ జన్మదినం.. అంటే డాక్టర్స్‌ డే!. బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని బంకింపుర్‌లో 1882 జూలై ఒకటిన జన్మించిన బీసీ రాయ్ అనేక శ్రమల కోర్చి పట్టుదలతో వైద్య విద్యను అభ్యసించారు. అనంతరం ఆయన సేవలతో భారతీయ వైద్య రంగానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చారు. కోల్ కతా మేయర్ గా,  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా , కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పని చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా కూడా పని చేశారు. ఆయన జీవిత కాలంలో వివిధ పదవుల్లో ఉన్నప్పుడు చేసిన అపార సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1961లో ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డుతో సత్కరించింది. వైద్యుడిగా మొదలైన ఆయన జీవితం ప్రజాసేవతో ముగియడంతో ఆయన స్మారకార్థం భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును డాక్టర్స్ డే గా ప్రకటించింది. హ్యాపీ డాక్టర్స్ డే.. 

No comments: