చేపలు ఆడుతూ పాడుతూ.. | Aquarium Maintenance Tips and Pet Fish Care


మానసిక ఒత్తిడి దరిచేరకుండా గార్డెనింగ్, పెట్స్ పెంచడం వగైరా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పైగా వీటితో వ్యాయామం కూడా కావున ఆరోగ్యం చేకూరుతుంది. ఇంట్లో అక్వేరియంలోని చేపలను చూస్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అందుకే గుండెజబ్బులు రావని కూడా పరిశోధనలు స్పష్టం చేసాయి. ఇంట్లో పెద్ద అక్వేరియం అమర్చుకోవాలని నియమం ఏమీలేదు. చిన్న ఫిష్ బౌల్ లో కూడా రెండు చేపలను పెంచుకోవచ్చు. సాధారణంగా గోల్డ్‌ఫిష్‌ అయితే ఇట్టే ఆకుట్టుకుంటాయి. అయితే వీటి సంరక్షణ ఎలా? అనేనా మీ సందేహం. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇక మీ అక్వేరియం లో మూడు గుడ్లు - ఆరు చేపపిల్లలే..!

- ఇంట్లో చక్కగా గాలి, వెలుతురు ప్రసరించే ప్రాంతంలోనే ఫిష్ బౌల్ లేదా అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలి. వీటి కోసం టివి, ఫ్రిజ్.. వంటి వాటిమీద కాకుండా హాల్లో ఒక టేబుల్ లేదా స్టాండ్‌ ను ఉపయోగించడం ఉత్తమం.

- బౌల్ అయితే రెండు ఫిష్ లకు మించి వేయకూడదు. ఇక అక్వేరియం సైజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్ని ఫిష్ లు వేయాలో చూసుకోవాలి. ఇళ్ళల్లో ఎక్కువగా గోల్డ్‌ ఫిష్‌ లను ఇష్టపడతారు. ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండడమే కాక ఇంటి అందం ద్విగుణీకృతం అవుతుంది.

- ఎక్కువ చేపలు లేదా వివిధ రకాల చేపలను ఒకే చోట చేర్చడం వల్ల అవి ఎంతోకాలం మనలేవు.

- అక్వేరియంలో రక్షిత మంచినీటిని వాడకూడదు. బోర్‌ నీళ్లు మాత్రమే వాడాలి. ఇవి అందుబాటులో లేని పక్షంలో రక్షిత నీటిని మూడు రోజుల పాటూ నిల్వ చేసి వాడుకోవచ్చు. అలాచేయడం వల్ల క్లోరైడ్‌ ప్రభావం తగ్గుతుంది. లేదంటే చేపలు చనిపోతాయి. 

- ఫిష్ బౌల్‌ అయితే మూడు రోజులకు, అక్వేరియం అయితే వారం రోజులకు ఒకసారి శుభ్రం చేసి నీటి విధిగా మార్చవలసి ఉంటుంది.

- ఫిష్ ట్యాంక్ శుభ్రపరిచే సమయంలో చేపలను వల సహాయంతో మరోక నీటి తొట్టిలోకి మార్చుకోవాలి.

- వీటికి ఆహారం రోజుకు ఒకసారి మాత్రమే, చేపల సంఖ్యను బట్టి వేయాలి.

- అక్వేరియం పెద్దదయితే వాటికి అనువైన మొక్కలను కూడా పెంచుకోవచ్చు.

- అక్వేరియం లో అందానికి వాడే లైట్, రాళ్ళు, రవ్వలు, ప్లాస్టిక్ మొక్కలు, బొమ్మలు.. వంటి వాటి విషయంలో తగుజాగ్రత్తలు అవసరం.

- అక్వేరియం సైజ్ కి సరిపడా ఎయిర్ పంప్ ను ఏర్పరచుకోవడం తప్పనిసరి.

- చేపల పెంపకం గురించిన జాగ్రత్తలు పిల్లలకు వివరించడంతో పాటు ఇతర పెంపుడు జంతువులకు అక్వేరియం అందకుండా జాగ్రత్త పడాలి.

- బంధుమిత్రలకు వివిధ సందర్భాలలో గిఫ్ట్ లా కూడా పెట్ ఫిష్ లను, అక్వేరియం లేదా దాని ఎససరీస్ ని ప్లాన్ చేయవచ్చు.


No comments: