వడదెబ్బ.. జాగ్రత్త! | Protect yourself from Sunstroke | Home Remedies to treat Heat Stroke


వేసవిలో తీవ్రమైన ఎండ వేడిని తట్టుకునేందుకు శరీరం అదనంగా శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి తోడు వేడిని తట్టుకునేందుకుగాను మంచి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం సక్రమంగా అందదు. ఇలాంటి కారణాలన్నీ వెరసి రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి ఎంత తగ్గితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఎంత జాగ్రత్త పడినా డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తితే ఒ.ఆర్‌.ఎస్‌.. ఓ చక్కని ఔషధం అని గుర్తించాలి. వాంతులు, విరేచనాలు కారణంగా లోపల ఉన్న నీరు, లవణాలు బయటకు పోవడంతో త్వరగా నీరసించిపోతారు. అయితే వెంటనే ఒ.ఆర్‌.ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌)ను తాగాలి. దీనివల్ల శరీరం లోని నీటి, లవణ శాతాన్ని నిలకడగా ఉండేలా చూసుకోవచ్చు. కొన్ని సమయాల్లో ఒ.ఆర్‌.ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదు. దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఒక లీటరు కాచి చల్లార్చిన మంచి నీటిలో ఆరు టేబుల్ స్పూన్ల పంచదార, అర చెంచా ఉప్పు చేర్చి బాగా కలియపెట్టాలి. ఈ ద్రవాన్ని తయారుచేసేటప్పుడు నీరు, ఉప్పు, పంచదారల మోతాదు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త వహించాలి.

ఎండలో బయటకు వెళ్లవలసివస్తే తప్పని సరిగా గొడుగు వాడాలి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. విధిగా నెత్తికి టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. డీహైడ్రేషన్ భారిన పడకుండా తరచూ ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీరు, చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓరల్ రీ హైడ్రేషన్ ద్రవణం తాగుతుండాలి. వడదెబ్బకు గురైన వారిని వెంటనే శీతల ప్రదేశానికి తరలించాలి, చల్లని నీటిలో గానీ, ఐస్‌లోగాని ముంచిన గుడ్డతో శరీరమంతా తుడవాలి. అయినా వారిలో మార్పులేనట్లయితే వెంటనే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించాలి.


pc:internet

No comments: