మలేషియాలో తొలిసారిగా 1998వ సంవత్సరం బయటపడ్డ నిఫా వైరస్ గబ్బిలాలు, గుడ్ల గూబలు, కోతి, పిల్లి, పందులు.. వంటి వాటి ద్వారా వ్యాపిస్తూ కేరళలో మృత్యు ఘంటికలు మోగించడమే కాకుండా పక్క రాష్ట్రాలకు సోకుతోందని హెచ్చరికలు వస్తున్నాయి. దీని నివారణకు వ్యాక్సిన్ లేదు. ఈ నిఫా వైరస్ ని అరికట్టడానికి మందులు కూడా లేవని, ప్రాథమిక దశలో గుర్తిస్తేనే ప్రత్యేక చికిత్సతో నివారించవచ్చని వైద్యులు అంటున్నారు. వ్యాధి లక్షణాలు ఐదు రోజుల నుంచి రెండు వారాల్లో బయటపడుతాయి. ముఖ్యంగా జ్వరం, జలుబు, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన.. వగైరా ఉంటాయిట.
సరియైన సమయంలో చికిత్స అందకపోతే ఒకటి, రెండు రోజుల్లో బాధితులు కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. అందుకని నిఫాను కట్టడి చేయడానికి ముందస్తు జాగ్రత్తలు ప్రతీ ఒక్కరు తప్పక తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రతలో భాగంగా భోజనం చేసేటప్పుడు విధిగా చేతుల్ని కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగితే కాని తిన వద్దు. పండ్ల పై ఎలాంటి మరకలు, పగుళ్లు, పక్షులు కొరికిన ఆనవాళ్ళు.. లేకుండా ఉన్నవి మాత్రమే వినియోగించాలి.
No comments:
Post a Comment