ఎండల్లో సాధ్యమైనంతవరకు మధ్యాహ్నం వేళ ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. టూవీలర్ పై రైడింగ్ తప్పదు అనుకుంటే కొన్ని జాగ్రత్తలు విధిగా పాటించాలి. ఎండల్లో ద్విచక్ర వాహనాలను నడిపే మహిళల విషయంలో ముఖ్యంగా చర్మం నల్లపడడం, జుత్తు నిస్సత్తువుగా మారడం జరుగుతుంది. ఎండకు తోడు పొల్యూషన్ కూడా తోడైతే తలలో చుండ్రు, కేశాలు రాలిపోవటంతో పాటు అనేక చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరుతాయి. అందుకని హాయ్.. హాయ్.. గా కూల్ గా టూవీలర్ పై సాగిపోవాలంటే దుమ్ము, ధూళి కణాలు, కాలుష్యం, వేడి గాలుల నుండి చర్మాన్ని సంరక్షించుకోవడానికి బైకర్స్ తప్పక స్కార్ఫ్ వాడాలి. ఫుల్ స్లీవ్ గ్లౌజ్ ధరించిచాలి. హెల్మెట్ ధరించడానికి ముందుగా మీ కేశాలను చక్కగా స్కార్ఫ్‌తో కవర్ చేయడం మంచిది. వీలైనంతవరకు మెత్తగా ఉన్న కాటన్ స్కార్ఫ్‌లను ఉపయోగించండి. ముఖానికి, చేతులకు సన్‌స్ర్కీన్ లోషన్ వాడుకోవాలి. అలాగే సమ్మర్ డ్రెస్సింగ్‌లో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కాటన్ దుస్తులనే ప్రిఫర్ చేయాలి. కాస్త వదులుగా గాలి ఆడుతూ శరీరాకృతికి తగిన వాటిని ఎంచుకోవాలి. చర్మం కనబడకుండా ఉండేవిధంగా దుస్తులు ధరించాలి. వెహికిల్ సీట్ త్వరగా వేడెక్కకుండా వెల్వెట్ కవర్లను వాడటం మంచిది. ఈ కాలంలో బైక్, స్కూటర్ లపై స్పీడుగా వెళ్లకూడదని గమనించాలి. లేదంటే వడగాలికి డీహైడ్రేషన్, వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మరవద్దు సుమా.
No comments:
Post a Comment