ఒక పక్క ఎండ, మరో పక్క వర్షాలు.. ఇలా వాతావరణ మార్పుల వల్ల దగ్గు అందరిని వేధించే సమస్యే. మన శ్వాస క్రియకు ఆటంకం కలిగినప్పుడు దగ్గు వస్తుంది. వేసవి తాపం తీరడానికి అంటూ తాగే శీతల పానీయాల వల్ల ఈ సమస్య మరింత జఠిలం అవుతుంది. గోరువెచ్చని నీటిని తరచూ తీసుకోవడం, పుక్కిలించడం వల్ల ఈ దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మరికొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు చూద్దాం..
- దగ్గు భాదనుండి విముక్తికి అల్లం రసం, తేనెలను సమపాల్లలో బాగా కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి.
- కొన్ని తులసి ఆకులను శుభ్రపరచి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగాలి.
- కాస్త నిమ్మరసంలో, చిటికెడు పసుపు, తేనె చేర్చిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి.
- అర స్పూన్ శొంఠి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
- చిన్న కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది.
- అల్లం టీ ని తీసుకోవడం వల్ల కూడా దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
- పాలలో మిరియాల పొడి లేదా పసుపు వేసుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
https://www.youtube.com/c/vantintichitkalu
No comments:
Post a Comment