వేసవిలో లభించే పండ్లలో అల్లనేరేడు ఒకటి. ఈ పండ్లతో పోషకాలు పుష్కలంగా అందుతాయి అంటున్నారు.. వైద్యులు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లలతో పాటు ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ - ఎ, విటమిన్ - బి, విటమిన్ - సి వగైరా లభిస్తాయి. అల్లనేరేడు పండ్లు మాత్రమే కాకుండా చెట్టు ఆకులు, బెరడు, గింజలు.. అన్నీ అయుర్వేద చికిత్సలో ఉపయోగపడతాయి. ఇది సీజనల్ ఫ్రూట్ కావున సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండాలంటే పండ్లను ఆరపెట్టి పౌడర్ కొట్టి భద్రపరచుకోవచ్చు. ఈ పౌడర్ ని మండే ఎండల్లో షర్బత్ తయారుచేసుకోవడంలో వినియోగించుకోవచ్చు.
- వేసవిలో దాహం తీరుతుంది. శరీరానికి చక్కని చలువనిస్తుంది.
- కడుపులోనులి పురుగులను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది.
- శరీరంలోని వ్యర్థాలు విసర్జించబడుతాయి. ఫలితంగా రక్తశుద్ధి జరుగుతుంది.
- ఇందులోని విటమిన్ - సి కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచడంలో నేరేడు దోహదం చేస్తుంది. అందుచేత మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లతో ఎంతో మేలు కలుగుతుంది.
- వీటిల్లో సింహభాగం ఉండే పొటాషియం మధుమేహగ్రస్తులెకే కాక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఎంతో మంచిది.
- మూత్ర విసర్జనకు తోడ్పడడంతో పాటు కిడ్నిల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది.
- చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్తుతుంది. నోటి దుర్వాసన దూరమవుతుంది.
- అంతేకాకుండా నోటి, మూత్రాశయ క్యాన్సర్‌లకు చెక్ పెడుతుంది.
pc:internet
No comments:
Post a Comment