సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యులు చెప్తుంటారు. మరి ఈ సీజన్ లో లభించే రుచికరమైన పండ్లలో తాటిముంజ ఒకటి. వేసవిలో కోల్పోయే పోషకాలు, ఎలెక్ట్రోలైట్స్‌ను తాటిముంజలు భర్తీ చేస్తాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఆహారం అంటారు న్యూట్రిషనిస్టులు. ముఖ్యంగా చెమట పొక్కులు, స్కిన్ అలెర్జీలను నివారించడంలో చాలాబాగా పనిచేస్తుంది. అలాగే డీహైడ్రేషన్, వడదెబ్బల నుండి రక్షణ లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ - ఎ, విటమిన్ - సి, బీకాంప్లెక్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలతో బరువు తగ్గాలనుకొనేవారికి, తక్కువ చక్కెరతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారం అనిచెప్పవచ్చు.
No comments:
Post a Comment