తృణధాన్యాలతోనే సైజ్ జీరో..! | Why Is Cereal Important in the Diet? | Vantinti Chitkalu

బరువు ఒక సమస్యా..!
శరీర బరువు తగ్గాలంటే ముందు దానికి తగ్గ కమిట్మెంట్ ఉండాలి.  తీసుకునే ఆహారంలో కాలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోవాలి. ఇలా డైట్ లో జాగ్రత్తలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలి.
రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు.. ఇవి తృణధాన్యాలే కదాని చిన్నచూపు తగదు. ఇవి మనకు కావలసిన పోషకాలు, శక్తిని అందించడంతోపాటు శరీర బరువును నియంత్రిస్తాయని నిఫుణులు సూచిస్తున్నారు. పైగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులనుంచి కాపాడతాయి. గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవు.
- బరువు తగ్గాలనుకునేవారికి రాగులు మంచి ఆహారం. దీనిలో ఫైబర్‌, ఇనుము ఎక్కువగా ఉంటాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది.
- కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు అధిక రక్తపోటును అదుపుచేయగల గుణం సజ్జలకుంది. ఇందులో ఉండే బీ కాంప్లెక్స్‌, విటమిన్స్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియమ్‌, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని ఫైబర్‌ మలబద్ధక సమస్యను పోగొడుతుంది. ఆస్తమాతో బాధపడే పిల్లలకు సజ్జలతో చేసిన ఆహారం పెట్టడం మంచిది.
- కొర్రల్లో యాంటీయాక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర దారుఢ్యానికి మంచి ఆహారం. అంతేకాకుండా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేసి మధుమేహాన్ని కట్టడి చేస్తుంది.
- జొన్నలలోని ఫైబర్‌ ఇతర పోషకాలు గుండె సంబంధిత జబ్బులను అదుపు చేస్తాయి. తక్షనం శక్తితో పాటు శరీర ఎదుగుదలకు జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. మధుమేహం, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్, మలబద్ధకంతో ఇబ్బందిపడేవారు జొన్నలు వాడడం ఎంతో మంచిది.
for more videos 
https://www.youtube.com/c/vantintichitkalu 

No comments: