ప్రపంచ మలేరియా దినోత్సవం - దోమలతో జాగ్రత్త! I How is malaria spread by mosquitoes? I World Malaria Day I 25 April

 

రోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖ, పలు స్వచ్చంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటి ద్వారా ప్రజల్లో దోమకాటు, తద్వారా మలేరియా వ్యాప్తి, వాటి నిర్మూలన తదితర విషయాలపై అధికారులు, నిపుణులు అవగాహణ కలిగిస్తారు. గాలిలోని వాహకాలు, దోమల ద్వారా వ్యాపించే మలేరియా వ్యాధి వేసవిలో మరింత విజృంబిస్తుంది. సరైన సమయంలో చికిత్సనందించకపోతే ఈ జ్వరం మెదడు, కిడ్నీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో మలేరియా కారణంగా సంభవిస్తున్న వేల మరణాలను తగ్గించడానికి నిపుణులు మనకు సూచిస్తున్న జాగ్రత్తలు ఇవి..

- మన పరిసరాల్లో శుభ్రత పాటించడం
- బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పోయకుండా ఉండడం
- చెత్త నిల్వ ఉండకుండా చూడడం
- కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం
- తాగి పడేసిన కొబ్బరి బోండంలోకి నీరు చేరకుండా చూడడం
- నిలువ నీటిని తొలగించడం 
- నిలువ ఉన్న నీటికి ఎటూ మార్గంలేకపోతే కిరోసిన్ చల్లడం
- వినియోగిచే నీటి బిందెలు, బకెట్, వంటపాత్రలపై ఎల్లప్పుడు విధిగా మూతలు పెట్టడం 
- దోమతెరలు ఉపయోగించడం 
- అవసరం అనుకుంటేనే కీటక సంహారక మందులను వాడడం



No comments: