భానుడి ప్ర'తాపం' తీరేదెలా.. I Safety Tips for Staying Cool I Preventing Heat Illness I लू लगने के लक्षण


హాట్ సమ్మర్ అనగానే అనవసర భయాలే ఎక్కువ. కొన్ని జాగ్రత్తలతో మండే ఎండల్లోనూ ఆహ్లాదంగా గడిపేయచ్చు. వ్యక్తిగత జాగ్రత్తలతో పాటూ ఇంట్లో చల్లదనానికి కొన్ని టెక్నిక్ లు వినియోగించాలి. ముందుగా పచ్చని చెట్లు మాత్రమే మన వాతావరణాన్నివేడెక్కకుండా కాపాడగలవని ఎసీలు, ఎయిర్ కూలర్లు కాదని నమ్మాలి. వేడిని నియంత్రించడానికి మన ఇంట్లో ప్రతి గదిలోను గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించేలా చూసుకోవాలి. వేసవిలో ఎండ నేరుగా ఇంట్లోకి రాకుండా ఉండాలి. ఆ సమయంలో తలుపులు, కిటికీలు మూసివేయాలి. గాలి ఆడడానికి అనువుగా ఉండే డోర్, విండో కర్టెన్లను వాడుకోవాలి. కొబ్బరిపీచు, వట్టివేళ్ళు, వెదురు చాపలను కానీ, ఫామ్ మ్యాట్ లను కానీ గుమ్మాలకు, కిటికీలకు ఎదురుగా ఏర్పరచుకుని స్వచ్ఛమైన వాతావరణాన్ని మన గదుల్లో సృష్టించుకోవచ్చు. వాటిపై కాసిని నీటిని జల్లితే వాటి నుంచి వీచే గాలి మరింత ఫలితం ఉంటుంది. చల్లని సమయాల్లో ముఖ్యంగా రాత్రివేళల్లో అన్నీ కిటికీలను తెరిచే ఉంచాలి. అప్పుడే గోడలు, ఇంట్లోని వస్తువులు తద్వారా రూం టెంపరేచర్ ని తగ్గించడం వీలవుతుంది.

ఎండసమయంలో వంటకు దూరంగా ఉండాలి. తప్పదనుకుంటే ఎక్సాస్ట్ ఫ్యాను కచ్చితంగా వాడుకొని వేడిగాలిని బయటికి తోలాలి. గ్యాస్, ఎలక్ట్రిక్ పరికరాలతో వంటావార్పు మాత్రమే కాకుండా దుస్తులు ఐరన్ చేయడం కూడదు. సహజంగా వేడిగాలికి పైకి వెళ్లే గుణం ఉండడంతో గదుల్లో ఉండే వెంటిలేటర్లు తగినట్టుగా ఉన్నాయేమో వేసవికి ముందే చూసుకోవాలి. టివి, కంప్యూటర్... లాంటి ఎలక్ట్రానిక్ పరికారాల వినియోగం మధ్యాహ్న సమయంలో తక్కువగా ఉండాలి. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు సంబందించిన ఛార్జింగ్ అడాప్టర్లను ఎలక్ట్రిక్ ప్లగ్ ల నుంచి అవసరం ముగియగానే కచ్చితంగా తొలగించాలి. ఇక ఇన్ కాండిసెంట్ ఎలక్ట్రికల్ బల్బులకు బదులు ఫ్లోరోసెంట్, ఎల్ ఇ డి బల్బులను మాత్రమే వాడుకోవాలి. ఇంట్లో లోపల గదుల అన్నీ తలుపులు తెరిచిఉంచడం మంచిది. ఎయిర్ కూలర్ల నుంచి వీచే గాలి మరింత చల్లదనాన్ని సంతరించుకోవాలంటే వాటిని కిటికీలకు బయట, గాలి ప్రసరణ ఉన్న ప్రదేశాలే అనువైనవని గుర్తించాలి. టేబుల్ ఫ్యాన్, పెడస్టల్ ఫ్యాన్ లు చల్లని గాలిని వెదజల్లుతాయి. సీలింగ్ ఫ్యాన్ లను వీలైనంత కిందకి బిగించుకోవాలి. టబ్ లో కొన్ని నీళ్లు పోసి గదిలో ఉంచడం వల్ల లాభం ఉంటుంది. ఆ నీళ్లలో కొన్ని కర్పూరం బిల్లలు వేయడం వల్ల సుహాసనతో పాటూ దోమలను పారదోలుతాయి. ఒవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు పూర్తిగా తగ్గకుండా చూసుకోవాలి. ఎండలో బట్టలు ఉతకడం వల్ల హుమిడిటీ అనిపిస్తుంది, కానీ ఉతికిన బట్టలు ఇంటి చుట్టూ ఆరేయడం వల్ల ఇంట్లో చల్లదనం ఉంటుంది. ఇంటి స్లాబ్ పైన నాణ్యమైన కూలెంట్ ను వాడుకోవాలి. ఇంట్లో థర్మోకోల్, పివిపి సీలింగ్ చేయించుకోవడం ఉత్తమం. ముదురు రంగుల జోలికి వెళ్లకుండా తేలికపాటి రంగులతో  గోడలకు వెల్ల వేయించాలి. పేయింట్ ల జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు. ఇండోర్ ప్లాంట్స్, ఫిష్ ఆక్వేరియం గదికి అందాన్ని, మనకు ఆహ్లాదాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మనం ధరించడానికే కాక పరుపు, దిండ్ల కవర్లు కూడా కాటన్ వే వాడాల్సి ఉంటుంది. సోఫా, దివాన్ కవర్లు కూడా లైట్ కలర్ లో గది అంతా చక్కని థీమ్ లా ఉంటే ఇక భానుడి ప్రతాపంలో కూడా హాయ్ హాయ్ కూల్ కూల్..

No comments: