సోషల్ మీడియా మాటున పొంచిఉన్న ప్రమాదాలు I Beware of Social Media I Social Networking Sites

సోషల్ మానియా..

న్నీ మాధ్యమాల్లోకెల్లా ఎలాక్ట్రానిక్ మీడియా అందునా సోషల్ నెట్ వర్కింగ్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యవస్థ.  సమాజంలో ఏ మూల విషయాన్నైనా కనురెప్పపాటులో విశ్వవ్యాప్తం చేస్తోంది.   ఒకప్పుడు సిరిగల వారింట టెలీఫోను, రేడియో, టలీవిజను కానీ e-కాలంలో ప్రతీ ఇంటా మోబైల్ ఫోన్లు, కంప్యూటరు సర్వసాధారణం అయిపోయాయి.  పైగా అంతర్జాలం వాటికి తోడైతే ప్రపంచం అరిచేతిలోనే.  ప్రపంచీకరణ పేరుతో క్షణం తీరిక లేక మనవ సంబంధాలు కనుమరుగవుతాయేమో అన్న భయాన్ని దూరం చేస్తూ విద్యుత్కణ సంబంధాలు మెరుగుపడ్డాయి.  ప్రపంచం నలుమూలలా ఉన్న బంధుమిత్రులను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండడం సాధ్యమవుతోంది.

రెండు వైపులా పదును ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైటులను సామాజిక స్పృహాతో మాత్రమే వినియోగించాలి. యువ భారతం ఈ వెబ్ సైటులను ఉపయోగించడంలో 'అలవాటు' ను దాటి 'వ్యసనం'గా మార్చుకుందని ఆయా సంస్థల గణాంకాలు చెప్పకనేచెప్తున్నాయి. 

అక్షరం, శ్రావ్యం, దృశ్యం   ఏదైతేనేమి మన ఆలోచనలు, స్పందనలు వాయువేగాన్నిమించి నలుగురికి అందించగల మాధ్యమాన్ని యువతరం సద్వినియోగపరచుకోవాలి.  సున్నితమైన అంశాలు కులం, మతం, ప్రాంతం, స్త్రీపురుష సంబంధాలు వంటి వాటితో  దూరంగా ఉండడం శ్రేయస్కరం.  నియంత్రణ కోల్పోయి ఇతరులకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యానాలు, చిత్రాలు వెబ్ సైటులలోకి బదిలీ చేస్తే పరువుపోవడమే కాక సైబర్ నేరంలో ఇరుక్కునే ప్రమాదముంది.  అశ్లీల సమాచారం పోస్ట్ చేయడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, వివాదస్పద అంశాలకు ప్రతిస్పందించడం కూడా సమాచార సాంకేతిక చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తారని గమనించాలి.

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైటు ఎంపిక నుంచి సభ్యత్వ నమోదు, నిర్వహణ వరకు అన్నీ కూలంకశంగా పరిశీలించాల్సిన విషయాలే.  ఏ మాత్రం ఏమరుపాటు వహించినా అనర్థాలు చోటుచేసుకుంటాయి.  ముఖ్యంగా మహిళలు వ్యక్తిగత వివరాలు, ఛాయాచిత్రాలు ఆన్లైన్లో పెట్టడం మానుకోవాలి. ఈ వెబ్సైటులలో మనం అందించే సమాచారం బహిర్గతమైతే అసాంఘీకకార్యకలాపాలకు దారితీస్తాయని గుర్తించాలి. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లలోకి మన ఈ-మెయిల్ కాంటాక్ట్స్ ఇంపోర్టు చేసుకోకూడదు పైగా తెలియని హైపర్ లింకులను క్లిక్ చేయడం చేయకూడదు.  మనం ఏం చెప్పదలచుకున్నామో కనీసం మనకైనా తెలియాలి. మనకు వచ్చిన సందేశము పరిచయం ఉన్నవారిదో కాదో ముందుగా చూసుకోవాలి. 

అయా బ్యాంకులు, సంస్థల అధికారిక వెబ్ సైటుల చిరునామాలను నేరుగా అంతర్జాల బ్రౌజర్లోనే టైపు చేసుకుని ఉపయోగించాలి.  మన సొంత బుక్ మార్కులను కూడా వినియోగించవచ్చు. ఇప్పటికే  సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లతో పిల్లలకు పరిచయం ఉంటే వాటిని సద్వినియోగపరచుకోవడంలో అవగాహణ కలిగించాలి.  పాప్-అప్స్, ఎక్స్ట్రా-ప్లగిన్స్.. వీటితోనే కాకుండా అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి.  ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరియైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లను వినియోగిస్తూ సమసమాజ స్థాపనకై  సోషల్ మీడియాని ఇంకా బలోపేతం  చేయాల్సిన అవసరం ఉంది.

IT Act for offensive social media -  Cyber Crime Complaints - Cyber Security Education‎ - Crime Investigation Department - Information Technology Act

No comments: