కాలుష్యంలోనూ చర్మం నిగారింపుగా.. | Easy ways to Protect your Skin from Pollution | VantintiChitkalu

ఈ రోజుల్లో బయటికి వెళ్లగానే చర్మం మురికిపట్టడం సహజం. పైగా పొల్యూషన్ కారణంగా కళ్ళు, ముక్కు మంటలు మొదలవుతాయి. అందుకనే బయటికెళ్ళే ప్రతీసారి తగు జాగ్రత్తలు తప్పనిసరి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ముఖం కాంతిహీనంగా తయారయితే తరచూ చల్లని నీటితో శుభ్రపరచుకోవడంతో పాటు రోజుకొకసారి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీనికి మన కిచెన్ లో లభించే పదార్థాలు ఎంతగానో ఉపకరిస్తాయి. బాగా మగ్గిన టమాటోల గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపటి తరవాత కడిగేసుకుంటే మెరుపులీనుతుంది. అలాగే కీరదోస రసం, గ్లిజరిన్‌, రోజ్ వాటర్ లను కలిపి కాని, విడిగా కాని వాడుకోవచ్చు. సరిపడా ఓట్స్‌ను మజ్జిగలో వేసుకుని పేస్ట్ చేసుకుని మురికిపట్టిన ప్రదేశంలో సున్నితంగా మర్దన చేసి కూడా శుభ్రపరచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కళ్ళు, ముక్కులకు సాంత్వన చేకూరడంతో పాటూ చర్మం తాజాగా ఉంటుంది. 
 

No comments: