నిలబడటం, కూర్చోవటం, నడవటం, చివరకు నిద్రలో సైతం సరైన విధానాలను అవలంభించకపోవటం చేతనే మెడ నొప్పి, వెన్నునొప్పి భాదిస్తాయి. వీటి నివారణకు తలదిండు, పరుపుల ఎంపిక, బరువులు ఎత్తడంలో జాగ్రత్తలవసరం అంటున్నారు వైద్యనిపుణులు.
- తలదిండు మరీ పలుచగా, మరీ ఎత్తుగా లేకుండా మెత్తది అయివుండాలి.
- గట్టిగా ఉండే పరుపు ఉపయోగించకూడదు. వెన్నెముక నిటారుగా ఉండేలా పడుకోవాలి.
- వంగి కాకుండా మోకాళ్ళపై కూర్చుని బరువులు ఎత్తడం మంచిది.
- అదేపనిగా ఎక్కువసేపు కూర్చొకుండా మధ్య మధ్యలో లేచి కాస్త అటూ ఇటూ తిరిగితే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ల నుంచి ఉపశమనం ఉంటుంది.
- కార్ డ్రైవింగ్ చేసే సమయంలో సీటు వెనుక భాగంపై వీపును అనించి కూర్చోవాలి.
- ద్విచక్రకవాహనాలపై ప్రయాణంలో వెన్నెముక తిన్నగా ఉండేలా చూసుకోవాలి.
pc : Internet
No comments:
Post a Comment