చిలుగడదుంపని కాల్చుకుని తింటే.. | The health benefits of Sweet Potato | VantintiChitkalu

మహా శివరాత్రి అనగానే జాగారం, ఉపవాసం గుర్తుకొస్తాయి. అలాగే వీటితో పాటు చిలుగడదుంప కూడా. అయితే స్వీట్ పొటాటో తినడం ఏ ఒక్కరోజుకో పరిమితం చేయకుండా తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకపదార్థాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సునాయసంగా జీర్ణమయ్యే చిలుగడదుంపతో పిల్లలకు రకరకాల స్నాక్స్ చేసిపెట్టవచ్చు. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపది ప్రత్యేక స్థానం. పిండి పదార్థాలు, పీచు, చక్కెరలతో పాటూ అద్భుతమైన పోషకాలు కలిగిన ఈ కందగడ్డ ఎంతో రుచిగా ఉంటుంది. శుభ్రపరచి పచ్చివి, కాల్చి, ఉడికించి.. ఎలా తీసుకున్నా ఎంతో బాగుంటుంది. వీటిని వంటల్లో వాడడంతో కొన్ని కూరలకు రుచిని సంతరిచిపెడతాయి. చిలుగడదుంపలను ముక్కలుగా కోసి అందులో బెల్లం చేర్చి ఉడికిస్తే నిమిషాల్లో ఘుమఘుమలాడే స్వీట్ రెడీ అవుతుంది. 

- జీర్ణశక్తిని పెంచడంలో ఇందులోని పిండి పదార్థాలు బాగా పనిచేస్తాయి.
- స్వీట్ పొటాటోలో ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- వీటితో సి, డి, ఇ - విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
- రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
- వీటిని కాల్చుకుని తినడం వల్ల ప్రొటీన్లు, ఖనిజాలు రెట్టింపవుతాయి.
- ఇందులోని బీటా కెరటిన్‌ చర్మ సంరక్షణలోను, కంటి చూపు మెరుగుపడడంలోనూ సహకరిస్తుంది.

No comments: