సెప్టెంబర్ 26: చెవిటి వారి దినోత్సవం | International Day of the Deaf | www.vantintichitkalu.com















అపరిశుభ్రమైన నీళ్లలో స్విమ్మింగ్, చెవిలో పిన్నులు, పుల్లలు, ఇయర్‌బడ్స్ పెట్టి తిప్పడం, దుమ్ముధూళి చేరడం, అకస్మాత్తుగా వినిపించే భారీ శబ్దాల వల్ల చెవి లోపలి పోర దెబ్బతినడం వంటివన్నీ వినికిడి సమస్యకు దారితీయవచ్చు. ఎక్కువ శబ్దంతో టీవీలు చూడడం, మొబైల్ ఫోన్ లో గంటల తరబడి మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ రేడియేష‌న్.. వీటి వ‌ల్ల కూడా సమస్య దరిచేరవచ్చు. ఫోన్ కాల్స్ మాట్లాడేట‌ప్పుడు ఒకే చెవివైపు మొబైల్ పెట్టి ఎక్కువ‌సేపు మాట్లాడ‌కూడ‌దు. ఇయ‌ర్‌ఫోన్స్‌ వాడినా గంటకు మించి మాట్లాడడం పనికిరాదు. వాల్యూమ్ మితంగానే ఉండాలి.

చెవిపోటు వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మ‌రిన్ని స‌మ‌స్యలకు దారి తీయవచ్చు. అందుకే వెంటనే ఈఎన్‌టీ డాక్టర్‌ని త‌ప్పనిస‌రిగా సంప్రదించాలి. సాధారణంగా జలుబు తర్వాత ఎక్కువగా కనిపించే సమస్య చెవి ఇన్ఫెక్షన్. ఇది ముదిరే కొద్దీ చెవిపోటు, జ్వరం, చెవి నుంచి చీము కారే సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే కర్ణబేరి దెబ్బతిని చెవిటి వారిగా మారే ముప్పు ఉంది.


స్నానం చేసే సమయంలో నీళ్లుచెవిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడడం, సైనస్ ఉంటే వెంటనే చికిత్స తీసుకోవటం ఉత్తమం. గులిమి (వాక్స్) ని తీయకపోవడమే మంచింది. ఆకు పసర్లు, నూనెలు వంటివి చెవిలో పోయకూడదు అని గమనించాలి.
 

No comments: