సెప్టెంబరు 21: గురజాడ అప్పారావు గారి జయంతి | Gurajada Apparao Jayanti Celebrations

దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌


దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి

            పాడి పంటలు పొంగిపొర్లె
            దారిలో నువు పాటు పడవోయి
            తిండి కలిగితే కండ కలుగును
            కండ కలవాడేను మనిషోయి

యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌


            దేశాభిమానం నాకు కద్దని
            వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
            పూని ఏదైనాను ఒక మేల్‌
            కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

            సొంత లాభం కొంత మానుకు
            పొరుగు వానికి తోడుపడవోయ్‌
            దేశమంటే మట్టి కాదోయ్‌
            దేశమంటే మనుషులోయ్‌

No comments: