మానవుడికి ప్రకృతి ప్రసాందించిన సహజ వనరులన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. ఇకనైనా మేలుకోకపోతే భవిష్యత్ అగమ్యగోచరమేనని ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. నేడు అనేక దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనవనరులైన సోలార్, విండ్, బయోమాస్ వంటి వాటిపై దృష్టి పెట్టాయి. మన దేశంలోనూ గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలు సౌరశక్తిని విరివిగా వాడకంలోకి తెచ్చాయి.
మొదటగా అమెరికా 1978 మే 31న సూర్యదినంగా పాటించింది. అమెరికా శాస్త్రవేత్త డేవిడ్ హౌస్, సౌర శక్తిని పరిశోధించి రాబోయే వంద సంవత్సరాల వరకూ దేశ అవసరాలన్నింటిని సౌర శక్తి తీరుస్తుందని చెప్పాడు. అంతేకాదు సౌరశక్తితో వివిధ ప్రాజెక్టులను ఎలా నడపవచ్చునో చూపించాడు. భౌగోళికంగా మన దేశం భూమధ్య రేఖకు దగ్గరలో ఉండడం వల్ల మనకు మరిన్ని అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
మన ఆదిత్యుడు శక్తి సామర్థ్యాలు అంతాఇంతా కావు. ఒక్క క్షణంలో సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తి మనకు వెయ్యి ఏళ్లు సరిపోయేంత. ఒక అంచనా ప్రకారం ఒక్కో చదరపు మీటర్ కు వెయ్యివాట్లు. భూమికి సూర్యుని నుంచి 174 పెటావాట్ల శక్తిగల సూర్య కిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్ కోసం హీట్ ఇంజన్ నుంచి ఫొటో వోల్టాయిక్ ఘటాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ దేశాల ప్రస్తుత విద్యుత్తు అవసరాలు దాదాపు 15 టెరావాట్లు కాగా కేవలం ఐదు శాతం సౌరశక్తిని అందిపుచ్చుకోగలిగినా ఇది అవసరాలకంటే యాబైరెట్లు ఎక్కువనే చెప్పాలి.
ప్రపంచ వ్యాప్తంగా విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు, చమురు, గ్యాస్ లోటు రోజురోజుకూ పెరిగిపోతోంది. మన దేశంలో 40కి పైగా ప్రధానమైన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు లోటుతో మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు దిగుమతి తలకు మించిన భారమవుతోంది. ఖరీదైన బొగ్గు దిగుమతులపై ఆధారపడాల్సి రావడం విద్యుత్ ఛార్జీల పెరుగుదల, సర్ చార్జీల బాదుడుకు దారి తీస్తున్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు మరింత సంక్షోభంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల మెగావాట్ల సామర్ధ్యంతో ప్రాజెక్టులు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. అయినా ఉత్పత్తి 850 మెగావాట్లకు మించడం లేదు. జల విద్యుదుత్పత్తికి కేవలం మూడు, నాలుగు నెలలు కాలం మాత్రమే అనుకూలంగా ఉంటోంది. ఇక దేశంలో అణు విద్యుత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. అణువిద్యుత్ ప్రాజెక్టుల వల్ల ప్రాణభద్రతపై సందేహాలు వెంటాడుతున్నాయి. అందువల్లే కాలుష్యరహిత సౌరవిద్యుత్ ఉత్పాదనపట్ల ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ - పలు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక విధానాలు అమల్లోకి తెచ్చి సౌరవిద్యుత్ ద్వారా సత్ఫలితాలు సాధిస్తూంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి భారీగా అవకాశాలున్నా 38 మెగావాట్లకే పరిమితమైంది. గుజరాత్ మూడువేల ఎకరాల్లో అతిపెద్ద సౌర పార్కు ఏర్పాటు చేసి 600 మెగావాట్లు ఉత్పత్తి చేయగలుగుతోంది.
సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి మాత్రమేకాకుండా నేరుగా పనిచేసే సోలార్ వాటర్ హీటర్లు. సోలార్ కుక్కర్లు, సోలార్ లైట్లు తదితర ఉపకరణాలు వాడటంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గించవచ్చు. సోలార్ పరికరాల వినియోగంలో ప్రజలకున్న అనుమానాలు స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వం నివృత్తి చేయాలి. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహకాలు అందిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీలతో పాటు బ్యాంక్ రుణాలు అందేలా ప్రభుత్వం చూడాలి. అప్పుడే సోలార్ పవర్ పై పట్టు సాధించవచ్చు. గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా కొత్త గృహాలు నిర్మాణించాలంటే సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటేనే అనుమతి మంజూరు చేయాలి. ఏ ఇంటికి కావాల్సిన కరెంట్ ను ఆ ఇంటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ను ఒడిసిపట్టాలని, అలా చేస్తేన అనుమతి అని చట్టం తేవాలి. థానే, అమరావతి, దుర్గాపూర్, నాగ్ పూర్ వంటి నగర కార్పొరేషన్ లు సౌర హీటర్లు వాడితే ఆస్తిపన్ను తగ్గిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి విధానాలను ప్రోత్సాహించాలి. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, మార్కెట్ యార్డ్ లు, కోళ్లఫారాలు, డెయిరీ ఫారాలు, ఫామ్ హౌస్ లు, కాల్వలు వంటి అనువైన ప్రదేశాల్లో సౌర ప్యానళ్లు ఏర్పాటు చేయవచ్చు. వాటి ద్వారా రికార్డ్ స్థాయిలో వెయ్యి మెగావాట్లకు పైగా కరెంట్ ను ఉత్పత్తి చేయవచ్చు. బంజరు భూములు, వృథా భూముల్లో లీజుపై సౌరవిద్యుత్ పార్కులు, ప్రైవేట్ భవనాలపై అద్దె ప్రాతిపదికన యూనిట్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టాలి. ఫలితంగా కరెంట్ గ్రిడ్లపై భారం తగ్గుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించవచ్చు. ముందున్న చీకట్లను తరిమికొట్టడానికి సౌరవిద్యుత్ మాత్రమే సరైన మార్గం. దీనికోసం స్పష్టమైన విధానం, కార్యాచరణ ప్రణాళిక, చిత్తశుద్ధి అవసరం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాలి.

No comments:
Post a Comment