ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఇప్పటికే పలు చోట్ల 45 నుంచి 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోరోహిణి కార్తె రాకుండానే రోళ్లు, రోకళ్ళు పగులుతున్నాయి. ఇక 'రోహిణి కార్తె' ఈ నెల 25న ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత సాధారణంగా ఈ సమయంలోనే నమోదవుతోంది. దీంతో వడదెబ్బకు గురయ్యే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. అత్యవసరమైన పనులు ఉంటే తగు జాగ్రత్తలు తప్పని సరి అని వైద్యులు సూచిస్తున్నారు.
- శీతల పానీయాలు తాగడం వల్ల దాహం తీరకపోగా మరింతగా పెరుగుతుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళద్దు
- కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి
- మూత్ర విసర్జన పచ్చగా వస్తుంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయిందని గుర్తించాలి
- వదులుగా ఉండే నూలు దుస్తులు , తెలుపు, లేతరంగులవి మాత్రమే ధరించాలి
- కిటికీలకు, తలుపులకు వట్టివేళ్ళ చాపలు, దుప్పట్లు వంటివి కట్టి వాటిపై నీళ్లు చల్లుతూ ఉండడం వల్ల గదులు చల్లబడతాయి
- ఇంట్లోకి గాలి వీచేలా చూసుకోవాలి
- వడదెబ్బకు గురైతే.. వెంటనే నీడలోకి తరలించాలి
దుస్తులు వదులు చేసి గాలి బాగా ఆడేలా చూడాలి
చల్లని నీళ్లతో తుడవాలి, ఐస్ వాటర్ అయినా వాడుకోవచ్చు
సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి
దుస్తులు వదులు చేసి గాలి బాగా ఆడేలా చూడాలి
చల్లని నీళ్లతో తుడవాలి, ఐస్ వాటర్ అయినా వాడుకోవచ్చు
సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి
No comments:
Post a Comment