ఫలాల రారాజు మామిడి పండు | ఫలరాజా పై అపోహలెందుకు? మామిడితో ఆరోగ్యం | The King of Fruits: The Health Benefits of Mangoes | బిగ్ బాస్ | Bigg Boss | vantintichitkalu | వంటింటిచిట్కాలు



ఆయా సీజన్లలో లభించే పండ్లను తీసుకోవడం ద్వారా ఆ సీజన్‌లో ఏర్పడే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని అందరికి తెలిసిందే. సమ్మర్ లో దొరికే ఫలాల రారాజు మామిడి పండ్లను చూస్తే నోరూరనిదెవరికి, అయినా అవి ఆరగించడానికి అపొహలెందుకు.

వేసవిలో విరివిరిగా దొరికే మామిడి పండ్లలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి వడదెబ్బ తగలకుండా కాపాడడంతో పాటు శరీరానికి కావలసినంత శక్తినిస్తాయి. అంతే కాకుండా శరీరం చల్లబరిచేలా చేస్తాయి. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. దీనితో క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి, పెక్టిన్‌, పీచు, సీరం కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి. విటమిన్లు, పోషకాలు అధికంగా ఉన్న కారణంగా మామిడి పండు తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇందులోని పీచు పదార్థాలు జీర్ణక్రియ బాగా జరగడానికి, సుఖవిరేచనం అవడానికి తోడ్పడుతాయి. అంతేకాకుండా ఈ పీచు అదనపు కేలరీలను దహించడం ఫలితంగా బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. మామిడిలోని తక్కువ గ్లెసిమిక్‌ ఇండెక్స్‌ వల్ల శరీరంలో షుగర్‌స్థాయి పెరగదు. విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, పలు రకాల కెరటోనాయిడ్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇందులో అధికంగా ఐరన్‌ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి దీనివల్ల సహజంగా ఐరన్‌ సమకూరుతుంది. అలాగే శరీరంలో కాల్షియం స్థాయి మెరుగుపడుతుంది.

కంటి సంరక్షణలో, చర్మ సౌందర్యం ఇనుమడింప చేయడంలోనూ మామిడి మేటి. దీనికి కారణం విటమిన్‌-ఎ మామిడిలో సమృద్దిగా ఉండడమే. మంచి కంటిచూపును కలిగించడమే కాకుండా కళ్లు పొడిబారకుండా కాపాడుతుంది. రేచీకటిని నివారిస్తుంది. మామిడి గుజ్జు, పాలు, తేనె కలిపి పేస్టులా తయారు చేసి స్క్రబ్‌లాగా వాడుకోవచ్చు. ఇక చర్మం లేతగా, మృదువుగా మారడం తధ్యం. శరీరంపై స్వేద గ్రంధులు శుభ్రపడి తద్వారా శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్ధీకరిస్తాయి.


No comments: