నవ్వు ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం రోగం.. అన్నారు మన పెద్దలు. నవ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇంటర్నెట్ లోనో, మొబైల్ ఫోనులోనో జోక్స్ చెప్పుకోవడం అందరికి ఉత్సాహం కలిగిస్తుంది. కార్టూన్లు, హాస్య కథలు చదవడం, టీవీలో కామెడీ బిట్లు చూడడం మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. చిన్న పిల్లలతో సంభాషణ వల్ల కూడా మానసికొల్లాసం కలుగుతుంది. మనస్పూర్తిగా నవ్వే నవ్వు నలుగురి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు వల్ల మనుషుల మధ్య ఉండే మనస్పర్థలు తొలగిపోతాయి. దానివల్ల పలువురి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.
No comments:
Post a Comment