పెంపుడు జంతువులను ప్రేమించండిలా.. | మే 6: ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం I Pet Animals are Good for Health I Pets Love


కొద్దిపాటి సంరక్షణకే  పెంపుడు జంతువులు ఎలాంటి  ఒడంబడిక లేకుండా ప్రేమని, విశ్వాసాన్నీ మనపై కనబరుస్తాయి.  కుక్క, పిల్లి, చేపలు, పక్షులు - మనం పెంచే  పెట్స్ ఏవైనా వాటిని ప్రేమగా చూసుకోవడం మరవద్దు. వాటిని మనం పట్టించుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని ముఖ్యంగా కుక్కలైతే ఇట్టే పట్టేయగలవు. ఒంటరితనాన్ని పారదోలి మనకు చేదోడువాదోడుగా ఉండి సంతోషాన్ని, వ్యయామాన్ని తద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించే పెంపుడు జంతువులపై వారాంతాల్లో, సెలవు రోజుల్లో మరింత శ్రద్ధ వహించాల్సిందే.

- కాస్త సమయాన్ని వెచ్చించి పెంపుడు జంతువుల నివాసాల్ని, ఉపయోగించే వస్తువులను శుభ్రపరచాలి. వాటికి ఇష్టమైతే స్నానం చేయించాలి. విశేషమైన అలంకారాలకు అవి అనుమతిస్తే ఆ ముచ్చటనీ తీర్చుకోవచ్చు.
- పెంపుడు కుక్కని రోజూకంటే కాస్త ఎక్కువ నడకకు తీసుకెళ్లాలి. అదీ కొత్త ప్రాంతం అయితే మరీ మంచిది. ఇలా చేయడం వల్ల 'స్వామికార్యం-స్వకార్యం' చందంగా దానితో పాటూ మనకి మానసికొల్లాసం కలుగుతుంది.
- కుందేలు, చేపలు, పక్షులు -ఇలా ఏ పెట్స్ నైనా కాస్త విశాలంగా తిరుగాడే సౌకర్యాన్ని కలిగించాలి.
- ఎప్పటిలాగానే కాకుండా సెలవు దినాల్లో కొంగ్రొత్త పదార్ధాలతో విందు ఏర్పటుచేయాలి.
- మార్కెట్ లో లభించే వివిధరకాలైన ఆటబొమ్మలు, వాటి పెంపకంలో అవసరమయ్యే వస్తువులు, విడిభాగాలు కొనిపెట్టి వాటిని మచ్చిక చేసుకోవాలి.
- వాటిని ఎప్పుడూ కొట్టడం, తిట్టడం కాకుండా సరియైన ప్రవర్తన, శిక్షణతో మెలిగేలా చూసుకోవాలి.

అంత అల్లారుముద్దుగా పెంచుకునే జంతువులకు ముందు జాగ్రత్తగా టీకామందులు వేయించడం, క్రమం తప్పకుండా వాటిని పశు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం మరవద్దు.

No comments: