పాము విషంతో ఎయిడ్స్ కు చెక్ | Snake Venom Can Cure AIDS | vantinti chitkalu


ఎయిడ్స్ నివారణకు రామాంతాపూర్, హైదరాబాద్ హోమియో కళాశాల వైద్యులు మందు కనిపెట్టారు. పాము విషంతో తయారు చేసిన క్రొటాలస్ హరిడస్ ఔషదంతో ఎయిడ్స్ కు చెక్ పెట్టచ్చని చెప్తున్నారు. ఈ హోమియో మందు గతంలో ఆఫ్రికాలో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న ఎబోలా వ్యాధిని సమూలంగా నివారించడంలో ఉపయోగపడింది. ఇప్పుడు హోమియోపతి వైద్యులు రెండేళ్లుగా 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై ప్రయోగించి ఎయిడ్స్ నివారణలోనూ పూర్తిగా సఫలీకృతులయ్యారు. అలాగే ౩ వేల మంది రోగులకు వ్యాధి తీవ్రత తగ్గగా,  11 వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారన్నారు. దీంతో ఆసుప‌త్రికి ఎయిడ్స్ రోగుల తాకిడి పెరిగింది.

హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్‌ మనిషిలో పూర్తిగా రోగనిరోధక శక్తిని  క్షీణింపచేస్తుంది, ఇతర వ్యాధులకు కారణమయ్యేలా చేసే పరిస్థితినే అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌ అంటారు. హెచ్‌ఐవి శరీరంలోనికి ప్రవేశించిన వెంటనే ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇతర వ్యాధులన్ని ఒకేసారి కబలించి ఒక్కసారిగా వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయి. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, విశృంఖల లైంగిక సంబంధాలు, పలువురు కలసి ఒకే సిరంజితో మాదక ద్రవ్యాలను వాడడం, రక్తమార్పిడి.. ఇలా హెచ్‌ఐవి వ్యాప్తి చెందుతుంది.

రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో ఎయిడ్స్ దుష్ప్రభావం ఎక్కువగా ఉన్నా, సమర్థవంతంగా ఎదుర్కొని ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎయిడ్స్ నిరోధానికి ఎక్కువ శాతం ఔషధాల సరఫరాలో భారత్ కీలక భూమిక పోషిస్తోంది. భారత దేశంలోని ఫార్మాస్యూటికల్ సంస్థలు తయారుచేసిన చౌక జెనెరిక్ ఔషధాలే వర్ధమాన దేశాల్లో హెచ్‌ఐవీ చికిత్సకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇంకా చౌకగా హెచ్‌ఐవి, ఎయిడ్స్ ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. 


# ఎయిడ్స్ కు నివారణ ఒక్కటే మార్గం | హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ కు మందు లేదు | Prevention is Better than Cure | HIV / AIDS

No comments: