ఆరోగ్యవంతుడికి బాడీ టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్ రేటు, బ్లడ్ ప్రెజర్.. ఇలా అన్నీ అవధిలో ఉండాలి. ఇందులో ఏది అవధిని మించి పెరిగినా, తగ్గినా అనారోగ్యమే. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని అధిక రక్తపోటు(hypertension)గా పరిగణిస్తారు. అధిక రక్తపోటు వలన హార్ట్ ఎటాక్, గుండెజబ్బులు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, బ్రేయిన్ స్ట్రోక్.. వచ్చే ప్రమాదముంది. వంశపార్యపరంగానే కాక ధూమపానం, మద్యపానం, అధిక బరువు, అధిక కోలెస్ట్రాల్, ఉప్పు ఎక్కువగా వాడడం వలన అధిక రక్తపోటు వస్తుంది. బీపి చెక్ చేయించుకున్నప్పుడు స్ఫిగ్మోమానోమిటర్ పై సాదరణ రక్తపోటు 120-80గా ఉండాలి. రక్తపోటు 140-90 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే రక్తపోటు తగ్గించు కోవటానికి మందులు కచ్చితంగా వాడవలసి ఉంటుంది. రక్తపోటు 180-140 అంతకంటే ఎక్కువకు చేరితే శరీరంలోని ప్రధానమైన అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్బవతులలో అధిక రక్తపోటు వలన తల్లికి, బిడ్డకు ప్రమాదం. వ్యాయామం, యోగా, ధ్యానం.. ఇలా చేస్తూ ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం ఉత్తమం. అలాగే పూర్తిగా ధూమపానం, మద్యపానంలకు దూరంగా ఉండాలి.
రక్తపోటు నియంత్రణలో ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పప్పు దినుసులు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, మజ్జిగ.. వగైరా ఉండాలి. అలాగే ఆహారంలో ఉప్పు తగ్గించాలి. సాధ్యమయినంత వరకు ఉప్పుని మితంగా వాడటం అలవర్చుకోవాలి.
No comments:
Post a Comment