స్నేహితుల రోజు | ఫ్రెండ్‌షిప్ డే
(ఆగస్టు మొదటి ఆదివారం)
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని ఘంటాపథంగా ప్రకటించిన అభ్యుదయవాది, మహాకవి శ్రీశ్రీ... సహస్రవృత్తులు, సమస్త చిహ్నాలు కవిత్వానికి ప్రాణమని దండోరా వేశాడు. కార్మిక లోకపు కల్యాణానికి... శ్రామిక లోకపు సౌభాగ్యానికి... సమర్పణంగా, సమర్చనంగా శ్రీశ్రీ రాసిన కవితలు వేల మంది యువకవులకు స్పూర్తినిచ్చాయి. వేనవేల ప్రజాగాయకులకు స్పృహనందించాయి. సామ్రాజ్యవాద దురాక్రమణ పంథాను ప్రతిఘటించిన కలం వీరులు ఎన్నో ఎర్ర సిరా చుక్కలు ధారపోసి కవిత్వాలకు అక్షరాలు పేర్చారు. కార్మిక, శ్రామిక వర్గ పోరాటాలకు సంఘీభావం చాటుతూ ఎందరో విప్లవ గళాలు సవరించుకుని జనగీతాలకు పల్లవులై నిలిచారు. మేడే అంటే అన్యాయాలను, అక్రమాలను, దోపిడీలను, దురంతాలను ధిక్కరించిన రోజు. కవులు, కళాకారులు ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన రోజు.