తల్లిపాలు అమృతంతో సమానం. శిశువు సంపూర్ణ అరోగ్యంగా, రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. అప్పుడే పుట్టిన పిల్లలకు శక్తితో పాటు, శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలను తల్లి పాలు దరిచేరనియ్యవు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లి బిడ్డకు తన చను పాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అంతేకాకుండా తల్లికి కూడా మేలు జరుగుతుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల వరకు పసి పిల్లలకు తల్లిపాలను పట్టించడం ఎంతైనా అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది.
తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి, రక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను WABA (World Alliance for Breastfeeding Action) నిర్వహిస్తోంది.