నులి పురుగుల నివారణ దినోత్సవం | National Deworming Day | ఆల్బెండజోల్‌ మాత్ర | Albendazole | Parasitic Worm Infestations | VantintiChitkalu | ఫిబ్రవరి 10 & ఆగస్ట్‌ 10

P.C.: Internet
చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య అనేక ఆరోగ్యపరమైన రుగ్మతలకు దారి తీస్తుంది. కాబట్టి నులిపురుగులను నిర్మూలించి చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లల్లో నులిపురుగులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికి తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ మాత్రలను  వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉంచుతారు.

అలాగే ఈ పాటి జాగ్రత్తలు అవసరం:
- పిల్లల చేతి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. గోర్లలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పరిశుభ్రమైన మంచి నీటినే తాగాలి. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న ఆహార పదార్థాలే తీసుకోవాలి.
- ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్తపడాలి. 
- పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే వాడాలి.
- వ్యక్తిగత శుభ్రతతో పాటూ పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి.

No comments: