Clicked by Vagdevi
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆచారం. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం. కుటుంబసభ్యుల క్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన ఈ వరలక్ష్మీ వ్రతం మహిళలు ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు.
No comments:
Post a Comment