ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. తద్వారా మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నాం. అనారోగ్యాల పాలవుతున్నాం. అయితే ఎంత ఒత్తడినైనా జయించడానికి ధ్యానం సరైన మార్గం అంటున్నారు వైద్యనిపుణులు.
రోజూ ప్రశాంత వాతావరణంలో చేసే ధ్యానంతో ఒత్తిడి, ఆందోళన వంటివి మాయమయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. మెదడు శక్తివంతమై ఆలోచనలలో, చేసే పనిలో చురుకుదనం పెరుగుతుంది. శారీరక, మానసిక భావోద్వేగాల సమతుల్యత ఏర్పడుతుంది. చెడు ఆలోచనలను కట్టిపెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. ఉదయం వేళ చేసే ధ్యానం రోజంతా ఉల్లాసంగా ఉండేలా చూస్తే, రాత్రివేళ ధ్యానం కమ్మని నిద్రకు దోహదం చేస్తుంది.